News December 18, 2025

ప్రశాంత ఎన్నికలకు సహకరించిన ప్రజలకు సీపీ కృతజ్ఞతలు

image

సిద్దిపేట జిల్లాలో మూడు దశల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా ముగిశాయని పోలీస్ కమిషనర్ ఎస్.ఎం. విజయ్ కుమార్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఎన్నికలు న్యాయబద్ధంగా జరిగాయని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణలో పోలీసులకు వెన్నుదన్నుగా నిలిచి, ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా సహకరించిన జిల్లా ప్రజలకు సోషల్ మీడియా వేదికగా సీపీ ధన్యవాదాలు తెలిపారు.

Similar News

News January 10, 2026

NGKL: జిల్లాలో కొనసాగుతున్న చలి తీవ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లాలో రోజురోజుకు చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలను వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 11.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్ మండలంలో 11.6, బల్మూర్ మండలంలో 12.0, తెలకపల్లి, వెల్దండ మండలలో 12.5, లింగాల మండలంలో 13.0, పదర మండలంలో 13.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 10, 2026

దేవీపట్నం: క్రికెట్ ఆడి వచ్చిన యువకుడు కుప్పకూలి మృతి

image

దేవిపట్నం మండలం పరగసానిపాడు గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో విషాద సంఘటన చోటుచేసుకుంది. రాజు అనే యువకుడు అప్పటివరకు బ్యాటింగ్ చేసి అవుట్ కావడంతో మంచినీళ్లు తాగి విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్థానికులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొచ్చారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు ధృవీకరించారు.

News January 10, 2026

కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న హౌస్ అరెస్ట్

image

కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. శుక్రవారం నెల్లూరులోని ఆయన నివాసం వద్ద పోలీసులు ఆయనకు నోటీసులు అందజేశారు. సోమశిల జలాశయం సందర్శనకు వెళుతున్న సందర్భంగా ఆయనకు నోటీసులు అందించినట్లు సమాచారం. ఈ నోటీసులు అందజేయడంపై వైసీపీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.