News April 21, 2024
సచిన్ అంచనా తప్పిందిగా..

నిన్నటి మ్యాచులో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ అంచనా తప్పింది. SRH భారీ స్కోరు సాధించినప్పటికీ ఢిల్లీనే గెలుస్తుందని.. మీ అభిప్రాయం ఏంటని ఫ్యాన్స్‌ను ప్రశ్నిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అయితే మిడిలార్డర్ ఫెయిలవ్వడంతో ఢిల్లీ 199 పరుగులకే ఆలౌటవ్వగా.. సన్‌రైజర్స్ విజయం సాధించింది. దీంతో ఢిల్లీపై SRH పూర్తి ఆధిపత్యం చలాయించిందని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. సన్‌రైజర్స్‌కు అభినందనలు తెలిపారు.
Similar News
News March 5, 2026
అప్పుడు తగ్గింది ఇప్పుడు నెగ్గడానికేనా?

గతేడాది నవంబర్‌లో జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో BJP-JDU కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 243 సీట్లలో BJP 89, JDU 85 చోట్ల గెలిచాయి. మెజార్టీ స్థానాలు దక్కినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాషాయ పార్టీ నితీశ్‌కే సీఎం పదవి ఇచ్చింది. అయితే BJP అప్పుడు వెనక్కి తగ్గింది ఇప్పుడు సీఎం పదవి చేజిక్కించుకొని, రాష్ట్ర రాజకీయాలను శాసించడానికేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News March 5, 2026
రాజ్యసభకు వెళ్తున్నా: CM నితీశ్ కుమార్

రాష్ట్ర రాజకీయాలను వదిలి రాజ్యసభకు వెళ్తున్నట్లు బిహార్ CM నితీశ్ కుమార్ ప్రకటించారు. ‘రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. అందుకే రాజ్యసభకు వెళ్తున్నా. 2 దశాబ్దాలుగా నాకు మద్దతుగా ఉన్న క్యాడర్, ప్రజలకు నా ధన్యవాదాలు. త్వరలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి నా సహకారం ఎప్పుడూ ఉంటుంది’ అని ట్వీట్ చేశారు. కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు.
News March 5, 2026
నెలకు రూ.40వేల జీతం.. ముంబై పోర్ట్ అథారిటీలో ఉద్యోగాలు

ముంబై పోర్ట్ అథారిటీ 10 జూనియర్ ప్రొఫెషనల్ ఇంటర్న్ పోస్టులను భర్తీ చేయనుంది. బీకామ్ అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 35ఏళ్లు. నెలకు రూ.40,000 చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://mumbaiport.gov.in


