News December 19, 2025
రాజమండ్రి: ‘క్లాట్’ ఫలితాల్లో శ్రీ షిర్డీసాయి ప్రభంజనం

రాజమండ్రి శ్రీ షిర్డీసాయి విద్యాసంస్థలు ‘క్లాట్’ ఫలితాల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సంస్థకు చెందిన డ్యాఫ్నీ సివిల్స్ అకాడమీ విద్యార్థిని ఎస్. శ్రీ సాయి గీతిక జాతీయ స్థాయిలో 3వ, రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. వివిధ కేటగిరీల్లో 100 లోపు ముగ్గురు, 500 లోపు 12 మంది ర్యాంకులు సాధించినట్లు విద్యాసంస్థల ఛైర్మన్ తంబాబత్తుల శ్రీధర్, డైరెక్టర్ టి. శ్రీవిద్య తెలిపారు.
Similar News
News January 9, 2026
ధనుర్మాసం: ఇరవై ఐదో రోజు కీర్తన

కృష్ణుడి అనుగ్రహం కోసం గోపికలు నిద్రిస్తున్న గోపికను నిద్రలేపే సన్నివేశం ఇది. బయట ఉన్నవారు ఆమెను ‘చిలుక’ అని పిలుస్తూ త్వరగా రమ్మనగా ఆమె చమత్కారంగా బదులిస్తుంది. చివరకు కంసుని గజమైన కువలయాపీడాన్ని, శత్రువులను సంహరించిన ఆ కృష్ణుని గుణగానం చేస్తేనే వ్రతం ఫలిస్తుందని, అందరం కలిసి భగవంతుడిని కీర్తిద్దామని వారు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇలా అందరూ కలిసి భక్తితో కృష్ణుని వైపు పయనిస్తారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 9, 2026
మడకశిరలో చెడ్డీ గ్యాంగ్ సంచారం.. పోలీసుల హెచ్చరిక

మడకశిర పట్టణ శివారు ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ దొంగలు సంచరిస్తున్నట్లు సీఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ లావణ్య ప్రజలను హెచ్చరించారు. రాత్రి సమయాల్లో ఎవరైనా తలుపులు తట్టినా, కాలింగ్ బెల్ కొట్టినా లేదా ప్రమాదం అని అరిచినా.. వెంటనే తలుపులు తీయొద్దని సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు లేదా స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు సహకరించాలని కోరారు.
News January 9, 2026
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.


