News December 19, 2025

అందరి సహకారంతో ప్రశాంతంగా పంచాయతీ ఎన్నికలు: కలెక్టర్

image

అందరి సహకారంతో జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని NZB జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ పరస్పర సమన్వయంతో కృషి చేసిన ఫలితంగా ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా పంచాయతీ ఎన్నికలను సజావుగా నిర్వహించుకోగలిగామని అన్నారు. సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే తరహాలో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.

Similar News

News January 11, 2026

NZBకు TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రాక

image

TPCC చీఫ్, MLC మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ వస్తున్నారు. ఉదయం 8 గంటలకు HYD నార్సింగి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 11.30కు NZB చేరుకుంటారు. 12 గంటలకు స్థానికంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మధ్యాహ్నం 3 గంటలకు R&B గెస్ట్ హౌస్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. రాత్రి నిజామాబాద్‌లో బస చేసి సోమవారం ఉదయం 11 గంటలకు వరంగల్ బయలుదేరి వెళ్తారు.

News January 11, 2026

NZB: చైనా మాంజా విక్రయాలపై పోలీసుల తనిఖీలు

image

చైనా మాంజా విక్రయాలపై పోలీసులు కొరడా ఝులిపించారు. సీపీ సాయి చైతన్య ఆదేశాల మేరకు NZB, బోధన్, ఆర్మూర్ డివిజన్ పరిధిలోని స్టేషన్‌ల పరిధిలో భారీగా తనిఖీలు చేశారు. నిషేధిత చైనా మాంజా ఎవరైనా విక్రయించినా, నిల్వ, రవాణా చేసినా నేరమేనని సీపీ తెలిపారు. చైనా మాంజా విక్రయం వల్ల, జంతువులకు, పక్షులకు, మనుషులకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. ఎవరైనా చైనా మాంజా విక్రయిస్తే 100కు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 11, 2026

నిజామాబాద్: జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు సాయి ప్రసన్న

image

జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు నిజామాబాద్ జిల్లా క్రీడాకారిని సాయి ప్రసన్న ఎంపికైంది. సబ్ జూనియర్ 32 కేజీల విభాగంలో రాష్ట్రస్థాయిలో బంగారు పతకం సాధించడంతో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. ఈ నెల 13 నుంచి 15 వరకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ పోటీల్లో సాయి ప్రసన్న పాల్గొననుంది.