News April 21, 2024
రిషభ్ పంత్‌పై ఫ్యాన్స్‌లో ఆందోళన

SRHపై మ్యాచ్‌లో రిషభ్ పంత్ ప్రదర్శన పట్ల టీమ్ ఇండియా అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అతడి ఆటతీరు మునుపటిలా లేకపోవడమే ఇందుక్కారణం. ఫిట్‌నెస్ పరంగానూ మోకాలి గాయం నుంచి ఇంకా కోలుకున్నట్లు కనిపించడం లేదంటున్నారు. పలు షాట్లు ఆడినప్పుడు పంత్ కింద పడిపోతుండటం గమనార్హం. రానున్న టీ20 వరల్డ్ కప్‌నకు అతడిని సెలక్ట్ చేస్తారన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో పంత్ ఎలా ఆడతారోనంటూ నెట్టింట చర్చ నడుస్తోంది.
Similar News
News January 31, 2026
కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.
News January 31, 2026
శుభకార్యాల్లో తమలపాకు ఎందుకు తప్పనిసరి?

మనం ప్రతి వేడుకల్లో తమలపాకును వాడుతాం. దీన్ని నాగవల్లి దళమని అంటారు. సకల దేవతల నివాసమని భావిస్తారు. దీని తొడిమలో లక్ష్మీదేవి, మధ్యలో పార్వతీదేవి, కొనభాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటారు. అందుకే పూజలు, పెళ్లిళ్లు వంటి శుభకార్యాల్లో వాడుతారు. దీంతో తాంబూలం సమర్పిస్తే దైవిక శక్తి, సుస్థిరత చేకూరుతాయని నమ్మకం. ఆయుర్వేద పరంగా ఇది జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అయితే పూజలకు పచ్చగా, తాజాగా ఉన్న ఆకునే వాడాలి.
News January 31, 2026
బంగాళాఖాతంలో ‘నో ఫ్లై జోన్’.. ఏం జరుగుతోంది?

ఫిబ్రవరి 5, 6 తేదీల్లో బంగాళాఖాతంలో సుమారు 3,190 కిలోమీటర్ల పరిధిలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తూ భారత్ NOTAM జారీ చేసింది. గతంలో కంటే ఈ పరిధిని పెంచడం చూస్తుంటే DRDO ఏదైనా లాంగ్ రేంజ్ మిస్సైల్‌ను లేదా సముద్ర ఆధారిత క్షిపణిని పరీక్షించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ వరుసగా నిర్వహిస్తున్న ఈ ప్రయోగాలు పొరుగు దేశాల్లో గుబులు రేపుతున్నాయి.


