News December 19, 2025

‘విద్యార్థులకు వరంలా మారిన జేఎన్టీయూ వీసీ ఆలోచనలు’

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం గురువారం M/s. ExcelR Edtechతో MOU ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించి జేఎన్టీయూ వీసీ సుదర్శన రావు మాట్లాడుతూ.. ఈ అవగాహన ఒప్పందం వలన విశ్వవిద్యాలయం పరిధిలోని విద్యార్థులకు ఉపయోగపడే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్‌లు ఆఫర్ చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో వీసీతో పాటు రిజిస్ట్రార్ కృష్ణయ్య, డైరెక్టర్లు సత్యనారాయణ, శోభా బిందు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2026

మంత్రి లోకేశ్‌తో పరిటాల కుటుంబ సభ్యులు

image

మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ నేతల విందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ పరిటాల శ్రీరామ్ దంపతులు పాల్గొన్నారు. విందు స్వీకరించి నియోజకవర్గ సమస్యలను మంత్రికి వివరించారు. అనంతరం పరిటాల సునీత, శ్రీరామ్ సతీమణి జ్ఞానకు నారా లోకేశ్ పట్టు చీరలు అందజేశారు.

News February 19, 2026

‘మార్చి 31లోగా అభివృద్ధి పనులు పూర్తి చేయాలి’

image

అనంతపురం జిల్లాలో వివిధ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆనంద్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆర్అండ్‌బీ, పంచాయతీ రాజ్, ఆర్డబ్ల్యూఎస్, సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్‌హెచ్‌ఎం స్కీం పనులు సకాలంలో పూర్తి చేయకపోతే నిధులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. నాణ్యతతో పనులను గడువులోగా ముగించాలని అధికారులకు సూచించారు.