News December 19, 2025

23న కడపలో రాయలసీమ AMCల ఛైర్మన్ల సమావేశం

image

ఈనెల 23న కడపలో రాయలసీమ జిల్లాల వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ల సమావేశం ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా AMC ఛైర్మన్లను నియమించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ విజయ సునీత ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. రాయలసీమ పరిధిలోని 72 వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కడప రీజనల్ డైరెక్టర్ రామాంజనేయులు గురువారం తెలిపారు.

Similar News

News January 13, 2026

కడప జిల్లాలో డ్రైనేజీల అభివృద్ధికి నిధులు మంజూరు

image

కడప జిల్లాలోని మున్సిపాలిటీల్లో డ్రైనేజీల ఆధునీకరణ, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ప్రొద్దుటూరు మునిసిపాలిటీకి రూ.65.09 కోట్లు నిధులు మంజూరయ్యాయని స్థానిక మునిసిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తెలిపారు. కడపకు రూ.100 కోట్లు, బద్వేల్ రూ.31.97 కోట్లు, రాజంపేట రూ.21.62 కోట్లు, జమ్మలమడుగు రూ.21.16 కోట్లు, పులివెందుల రూ.28.91 కోట్లు, ఎర్రగుంట్ల రూ.38.06 కోట్లు మంజూరయ్యాయన్నారు.

News January 13, 2026

ప్రొద్దుటూరు నూతన DSPగా విభూ కృష్ణ

image

కడప జిల్లా ప్రొద్దుటూరు DSP భావనను అధికారులు బదిలీ చేశారు. ఆయన స్థానంలో 2021 బ్యాచ్ ఐపీఎస్ అధికారి విభూ కృష్ణను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీచేశారు. డీఎస్పీ ఇతర పోలీసు అధికారులపై ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి బహిరంగంగా పలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలోనే బదిలీ చేశారని తెలుస్తోంది. విభూ కృష్ణ ప్రస్తుతం గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్‌గా ఉన్నారు. త్వరలో DSP బాధ్యతలు స్వీకరించనున్నారు.

News January 13, 2026

కడప: మద్యం బాటిల్‌పై రూ.10 పెంపు!

image

కడప జిల్లాలో గతనెల 1,43,405 కేసుల లిక్కర్ (IML), 54,938 కేసుల బీరు తాగేశారు. డిసెంబర్‌లో మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి రూ.98.98 కోట్లు ఆదాయం వచ్చింది. న్యూ ఇయర్ సంబరాల్లో ఒక్కరోజులోనే జిల్లాలో 9,658 కేసులు లిక్కర్, 3,991 కేసులు బీరు తాగారు. ఆ ఒక్క రోజులోనే రూ.7.23 కోట్ల ఆదాయం లభించింది. APలో రూ.99ల మద్యం, బీరు మినహా అన్ని బాటిళ్లపై రూ.10లు పెంచుతూ సోమవారం GO విడుదలైన విషయం తెలిసిందే.