News April 21, 2024

కూటమిలో దెందులూరు, అనపర్తి స్థానాలపై సందిగ్ధం

image

AP: NDAలో 2 స్థానాలపై సందిగ్ధత కొనసాగుతోంది. దెందులూరు, అనపర్తి స్థానాలపై BJP, TDP మధ్య చిక్కుముడి కొనసాగుతోంది. పొత్తులో BJPకి అనపర్తి సీటు కేటాయించగా.. కమలం గుర్తుపై పోటీ చేయాలని TDP నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు సూచించారు. నల్లమిల్లి అంగీకరిస్తే దెందులూరులో ఇప్పటికే టికెట్ ప్రకటించిన చింతమనేనికి ఇబ్బంది ఉండదు. లేదంటే అనపర్తి TDP తీసుకుని.. BJPకి దెందులూరు కేటాయించే ఛాన్సుంది.

Similar News

News February 2, 2026

RGM: 166 మంది బాలల విముక్తి.. 20 కేసులు నమోదు

image

RGM పోలీస్ కమీషనరేట్ పరిధిలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన లక్ష్యంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్-XIIలో మొత్తం 166 మంది బాలబాలికలను గుర్తించి రక్షించారు. CP అంబర్ కిషోర్ ఝా తెలిపిన వివరాల ప్రకారం.. PDPL, మంచిర్యాల జిల్లాల్లో కలిపి 20 కేసులు నమోదు చేసి 20 మందిని అరెస్ట్ చేశారు. వివిధ శాఖల సమన్వయంతో తనిఖీలు నిర్వహించి బాలలను కుటుంబాలకు అప్పగించారు. సమాచారం కోసం 1098 లేదా 100కు కాల్ చేయాలని సూచించారు.

News February 2, 2026

పెళ్లి కాదు పనే ముఖ్యం: బాస్

image

కొందరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చెప్పే ఓ ఘటన SMలో వైరలవుతోంది. ‘నా ఎంగేజ్మెంట్ 2 నెలల క్రితమే చెప్పాను. ఆ విషయాన్ని గాలికొదిలేసి ఇప్పుడు ఎంగేజ్మెంట్ ముఖ్యం కాదు వీకెండ్ కూడా పని చేయమంటున్నారు. ఇక్కడ చేసే వారికంటే పని చెప్పేవారు ఎక్కువ. గంటలు గంటలు జూమ్ కాల్స్ మాట్లాడాలి. నేను ఈ ప్రాజెక్టులో కొనసాగలేను. నా పెళ్లి కూడా వాయిదా వేసుకోలేను’ అని ఆవేదనను వ్యక్తం చేశారు.

News February 2, 2026

మ్యాడ్ సిరీస్‌లో క్రేజీ యాక్టర్స్!

image

యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్స్‌గా హిట్లు అందుకున్న ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ సిరీస్‌లో మూడో సినిమా రాబోతోంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘మ్యాడ్ జూనియర్స్’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. ఇందులో లిటిల్ హార్ట్స్ ఫేమ్ జై కృష్ణ, కోర్ట్ ఫేమ్ హర్ష్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైందని సినీ వర్గాలు వెల్లడించాయి.