News December 19, 2025
కోవూరు MLAతో ఇన్‌ఛార్జ్ మేయర్ రూప్ కుమార్

నెల్లూరు ఇన్‌ఛార్జ్ మేయర్‌గా రూప్ కుమార్ యాదవ్ బాధ్యతలు తీసుకున్న అనంతరం పలువురు ప్రముఖులను కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగరంలోని మాగుంట లేఔట్‌లో నివాసం ఉంటున్న కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రశాంతి రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. నగర అభివృద్ధికి కృషి చేయాలని ఆమె రూప్ కుమార్ యాదవ్‌ను కోరారు.
Similar News
News January 13, 2026
నెల్లూరు వాసికి కీలక పోస్టింగ్

నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇందుపూరుకు చెందిన ఏటూరు భాను ప్రకాష్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘం డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారిగా 2004 నుంచి అక్కడ పనిచేస్తున్నారు. డిప్యుటేషన్‌పై మన రాష్ట్రంలోనూ కొంతకాలం విధులు నిర్వర్తించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో నెల్లూరు జిల్లా వాసి పదవి పొందడం ఇదే తొలిసారి కావడం విశేషం.
News January 13, 2026
నెల్లూరు జిల్లాలో చైనా మాంజాలు నిషేధం: SP

నెల్లూరు జిల్లాలో చైనా మాంజా వాడకాన్ని నిషేధిస్తున్నామని ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల వెల్లడించారు. ‘సంక్రాంతి సమయంలో గాలిపటాలు ఎగరవేయడం ఆనవాయితీ. అందరూ సంతోషంగా పతంగులు ఎగరవేయాలి. చైనా మాంజా(దారం) వాడకంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ దారాలు అమ్మడం చట్టరీత్యా నేరం. ఎక్కడైనా ఆ మాంజాను విక్రయిస్తే 100కు డయల్ చేయండి’ అని ఎస్పీ కోరారు.
News January 13, 2026
నెల్లూరు ఎస్పీ హెచ్చరికలు ఇవే..!

సంక్రాంతి సందర్భంగా కోడిపందేలు, జూదాన్ని నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జూదాలు నిర్వహంచినా, అందులో పాల్గొన్నా కేసులు తప్పవని చెప్పారు. ఎక్కడైనా కోడి పందెం, జూద శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలిస్తే వెంటనే 112కు కాల్ చేయాలని ఆమె కోరారు.


