News December 19, 2025
కొత్తగూడెంలో 37 సీపీఐ సర్పంచులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేస్తుంది. అధికార కాంగ్రెస్ 271, ప్రతిపక్ష బీఆర్ఎస్ 105, సీపీఐ 47, ఇతరులు 46 గ్రామపంచాయతీల్లో విజయం సాధించారు. భద్రాద్రి జిల్లాలో బీజేపీ పార్టీ ఏ ఒక్క గ్రామపంచాయతీలో పాగా వేయలేదు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 37 సర్పంచ్ స్థానాల్లో గెలుపొందారు.
Similar News
News January 15, 2026
తగ్గిన బంగారం ధర.. మరోసారి పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.820 తగ్గి రూ.1,43,180కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,31,250గా ఉంది. మరోవైపు వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి. నిన్న కేజీపై రూ.15,000 పెరగగా, ఈరోజు రూ.3,000 పెరిగింది. మొత్తంగా రెండు రోజుల్లో 18,000 ఎగబాకి రూ.3,10,000 చేరింది.
News January 15, 2026
సైనికుల ఖార్ఖానా.. బావాజీపాలెం

నేడు జాతీయ సైనిక దినోత్సవం. ఈ సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దీనిని ‘జవాన్ల ఊరు’గా పిలుస్తారు. ఇక్కడ ప్రతి ఇంటి నుంచి కనీసం ఒకరు సైన్యంలో పనిచేస్తుండటం విశేషం. రెండో ప్రపంచ యుద్ధం నుంచి నేటి వరకు ఇక్కడి వారు దేశసేవలో తరిస్తున్నారు. యువత ఉదయాన్నే మైదానంలో కసరత్తులు చేస్తూ, ఆర్మీలో చేరడమే ఏకైక లక్ష్యంగా శ్రమిస్తుంటారు.
News January 15, 2026
నల్గొండలో మున్సిపల్ రిజర్వేషన్లు ఇవే..

1. నల్గొండ కార్పొరేషన్ 48: ST 1,SC 7, BC 16, UR 24
2. చండూర్ 10: ST 1, SC 1, BC 3, UR 5.
3.చిట్యాల 12: ST 1, SC 2, BC 3, UR 6.
4.దేవరకొండ 20: ST 3, SC 2, BC 5, UR 10.
5.హాలియా12: ST 1, SC 2, BC 3, UR 6.
6.మిర్యాలగూడ 48: ST 3, SC 5, BC 16, UR 24.
7.నకిరేకల్ 20: ST 1, SC 3, BC 6, UR 10.
8.నందికొండ 12: ST 1, SC 2, BC 3, UR 6.


