News April 21, 2024

విశాఖ నార్త్: మరోసారి బీజేపీ వశమవుతుందా?

image

AP: విశాఖ నార్త్ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 2014లో BJP, 19లో TDP ఇక్కడ నెగ్గాయి. పొత్తులో భాగంగా ఇక్కడ BJP పోటీ చేస్తోంది. ఈసారి కూడా 2014లో పోటీ చేసి గెలిచిన బీజేపీ నేత విష్ణుకుమార్ రాజే మళ్లీ బరిలోకి దిగారు. టీడీపీ, జనసేన మద్దతుతో గెలుస్తానని విష్ణు ధీమాగా ఉన్నారు. ఇటు గత ఎన్నికల్లో గంటాపై పోటీ చేసి ఓడిపోయిన కమ్ముల కన్నపరాజుని YCP మరోసారి యుద్ధానికి దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News March 31, 2026

IPL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ మృతి

image

ENGకు చెందిన IPL బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌ జాన్ విలియమ్(76) మరణించారు. ఈ నెల 29న MI-KKR మ్యాచ్‌ తర్వాత హోటల్‌కు వెళ్లారు. మరుసటి రోజు కాల్ చేసినా స్పందించకపోవడంతో సిబ్బంది మాస్టర్ కీతో డోర్ తెరిచి చూడగా జాన్ నేలపై పడిఉన్నారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టంలో అనుమానాస్పదంగా ఏమీ లేనప్పటికీ అసహజ మరణంగానే కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపారు.

News March 31, 2026

మలయాళ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ 25వ చిత్రం?

image

అల్లు అర్జున్ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ‘AA22’ తెరకెక్కుతుండగా, ఆ తర్వాత లోకేశ్ కనగరాజ్, త్రివిక్రమ్ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ప్రతిష్ఠాత్మక 25వ చిత్రానికి మలయాళ నటుడు బాసిల్ జోసెఫ్ డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. దీన్ని ‘గీతా ఆర్ట్స్’ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించనుందని తెలుస్తోంది. కేరళలో ఐకాన్ స్టార్‌కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.

News March 31, 2026

రేపటి నుంచి NTR వైద్యసేవలు బంద్!

image

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)లను నిలిపివేయనున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. రూ.3వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాయి.