News December 19, 2025

నంద్యాల: ఫొటోల మార్ఫింగ్.. ఇద్దరు మహిళల అరెస్ట్

image

కోవెలకుంట్ల, సంజామల, రేవనూరు, ఆళ్లగడ్డ పరిధిలోని పోలీసు అధికారుల ఫొటోలు అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్న ఇద్దరు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ ఎం.రమేశ్ బాబు తెలిపారు. ఫొటోలు మార్ఫింగ్ చేస్తున్న వారి సమాచారం తెలియడంతో బందెల స్పందన, బందెల మారతమ్మను కోవెలకుంట్లలో అరెస్ట్ చేశామన్నారు. మార్ఫింగ్‌కు వాడుతున్న రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

Similar News

News January 14, 2026

ASF: నూతన సర్పంచుల శిక్షణ వివరాలు

image

ఆసిఫాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 21 వరకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలకు చెందిన 335 మంది సర్పంచులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మొత్తం 35 రోజుల పాటు 7 బ్యాచ్‌లుగా, 2 టీమ్‌ల ద్వారా శిక్షణ అందించనున్నారు. గ్రామాభివృద్ధి, పాలన, ప్రభుత్వ పథకాల అమలుపై అధికారులు అవగాహన కల్పించనున్నారు.

News January 14, 2026

-40 మార్కులు వస్తే డాక్టరా?.. ఆందోళన!

image

నీట్ పీజీ-2025లో రిజర్వ్‌డ్(SC,ST,BC) కేటగిరీలో <<18852584>>కటాఫ్<<>> తగ్గింపుపై డాక్టర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. -40 మార్కులు వచ్చినా క్వాలిఫై అయినప్పుడు ఎగ్జామ్ ఎందుకని ప్రశ్నలు లేవనెత్తింది. కేవలం ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ట్రైనింగ్, ప్రాక్టీస్, సర్జరీల్లో పాల్గొనే అవకాశం కల్పించేలా ఉన్న ఈ నిర్ణయం బాధాకరమని తెలిపింది. కటాఫ్ తగ్గింపుపై పునరాలోచన చేయాలని, ఇది వ్యవస్థపై ప్రభావం చూపిస్తుందని చెబుతోంది.

News January 14, 2026

బాసర రైల్వే స్టేషన్‌లో ఆగే పలు రైళ్లు రద్దు

image

బాసర రైల్వే స్టేషన్ నుంచి నవీపేట్ మధ్య జరుగుతున్న డబ్లింగ్ పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలను 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు రైల్వే అధికారులు రద్దు చేశారు. మరి కొన్ని రైళ్ల రాకపోకలను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు డివై దిలీప్ కుమార్ తెలిపారు. పాక్షికంగా రద్దు అయిన రైళ్ల నెంబర్లు 11409/11410(NZB-PUNE), 11413/11414(DAB-MUE), 17687/17688(MMR-DAB).