News December 19, 2025

ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

image

ఈనెల 21న భద్రాద్రి జిల్లాలోని అన్ని కోర్టుల్లో జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజేందర్ తెలిపారు. ఏమైనా కేసులు ఉన్నట్లైతే వాటిని రాజీ చేసుకోవచ్చన్నారు. కక్షిదారులు తమ కేసులను రాజీమార్గంలో పరిష్కరించుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతుందని చెప్పారు. పెండింగ్ కేసుల పరిష్కారం కోసం ఈ లోక్ అదాలత్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.

Similar News

News December 28, 2025

NTR: చపాతీ ముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి

image

చపాతీ ముక్క ప్రాణం తీసిన ఘటన విజయవాడలోని చిట్టినగర్‌లో విషాదం నింపింది. తోట ప్రసాద్ అనే వ్యక్తి శనివారం చపాతీ తింటుండగా ఒక్కసారిగా చపాతి ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు బయటకు తీసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 108 సిబ్బంది వచ్చేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయారు.

News December 28, 2025

జిల్లా అధ్యక్షుడి తీరుపై అధిష్ఠానం సీరియస్..!

image

నల్డొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఇటీవల చోటుచేసుకున్న ఘర్షణపై పార్టీ అధిష్ఠానం స్పందించింది. వాజ్‌పేయి జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి సమక్షంలోనే నాయకుడు పిల్లి రామరాజుపై జరిగిన దాడిని రాష్ట్ర నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతిందని భావించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు.. వర్షిత్‌రెడ్డిని పిలిపించి మందలించినట్లు తెలుస్తోంది.

News December 28, 2025

భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తాం: ములుగు ఎస్పీ

image

మేడారం వన దేవతల దర్శనానికి ముందస్తు మొక్కుల చెల్లింపు కోసం వచ్చే భక్తులకు అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎస్పీ రామనాథన్ కేకన్ తెలిపారు. ఆదివారం భక్తులు అధిక సంఖ్యలో మేడారం రానున్న నేపథ్యంలో గద్దెల వద్ద ఏర్పాటులను ఎస్పీ పరిశీలించారు. పునర్నిర్మాణ పనుల వల్ల భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట జిల్లా పోలీసు అధికారులు ఉన్నారు.