News December 19, 2025
అధిక పోషక విలువల మాంసం.. కడక్‌నాథ్ సొంతం

అత్యంత పోషక విలువల కలిగిన మాంసానికి కడక్‌నాథ్ కోళ్లు ప్రసిద్ధిచెందాయి. వీటి చర్మం, మాంసం కూడా నలుపు రంగులోనే ఉంటాయి. మధ్యప్రదేశ్‌లో పుట్టిన ఈ కలమాశి కోడిని కడకనాథ్‌గా పిలుస్తారు. నాటుకోడితో పోలిస్తే ఈ కోడి మాంసంలో అధిక మాంసకృత్తులు ఉంటాయి. ఈ కోళ్లు 6 నెలల వయసు నుంచే గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏటా 100 నుంచి 110 గ్రుడ్లను మాత్రమే పెడతాయి. వీటి గుడ్లకు, మాంసానికి మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంది.
Similar News
News January 12, 2026
బీర సాగుకు అనువైన విత్తన రకాలు

బీర పంటలో మంచి దిగుబడి రావాలంటే విత్తన ఎంపిక ముఖ్యం. భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ రూపొందించిన అర్క సుజాత, అర్క ప్రసన్న, అర్క సుమిత్, అర్క విక్రమ్ వంటి రకాలతో పాటు.. సురేఖ, సంజీవని, మహిమ, ఎన్.ఎస్-3(NS-3), ఎన్.ఎస్.401 (NS-401), ఎన్.ఎస్.403 (NS-403), అర్జున్, లతిక, మల్లిక, నాగ వంటి హైబ్రిడ్ రకాలతో మంచి దిగుబడులను సాధించవచ్చు. మీ ప్రాంతాన్ని బట్టి నిపుణుల సూచనలతో వీటిలో రకాలను ఎంపిక చేసుకోవాలి.
News January 12, 2026
కర్కాటకము వర్షిస్తే కాడిమోకు తడవదు

సాధారణంగా కర్కాటక కార్తెలో వర్షాలు చాలా వేగంగా, కుండపోతగా కాకుండా కేవలం తుంపర్లుగా లేదా చాలా తక్కువ సమయంలోనే కురిసి ఆగిపోతుంటాయి. ‘కాడి’ అంటే ఎడ్ల మెడపై వేసే చెక్క, ‘మోకు’ అంటే దానికి కట్టే బలమైన తాడు. కర్కాటక కార్తెలో వర్షం ఎంత తక్కువగా కురుస్తుందంటే, కనీసం పొలంలో పని చేసే ఎడ్ల కాడికి ఉన్న ఆ తాడు కూడా పూర్తిగా తడవనంత తక్కువగా ఉంటుందని దీని అర్థం. ఈ వర్షం వల్ల ప్రయోజనం ఉండదని భావం.
News January 12, 2026
ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎవరికిస్తారో తెలుసా?

ప్రీ అప్రూవ్డ్ పర్సనల్ లోన్ అనేది బ్యాంకులు ముందుగానే అర్హత నిర్ధారించి ఎంపిక చేసిన కస్టమర్లకు ఇస్తాయి. ఆదాయం, సిబిల్ స్కోర్, లావాదేవీల ఆధారంగా లోన్ మొత్తాన్ని ఫిక్స్ చేస్తాయి. సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న వారికి SMS లేదా ఈమెయిల్ పంపిస్తాయి. తక్కువ డాక్యుమెంట్స్‌తో లోన్ మంజూరు చేస్తాయి. అయితే అధిక వడ్డీ ఉండే అవకాశం ఉంది. దీంతో అవసరం ఉన్నప్పుడే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.


