News December 19, 2025

MBNR: పంచాయతీ సెక్రటరీకి గ్రూప్- 3 ఉద్యోగం

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన పాశం రాఘవేంద్రకు 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం హన్వాడ మండలం రామునాయక్ తాండ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. నిన్న వెలువడిన గ్రూప్-3 ఉద్యోగానికి ఎంపికయ్యారు. పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూనే గ్రూప్‌కి ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధించడం పట్ల గ్రామస్థులు, బంధువులు సంతోషం వ్యక్త చేశారు.

Similar News

News January 14, 2026

BREAKING.. నల్గొండ ఇక కార్పొరేషన్.. గెజిట్ విడుదల

image

నల్గొండ ఇకపై ‘మహానగర’ హోదాలో రూపాంతరం చెందనుంది. మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పట్టణాభివృద్ధిలో నవశకం ప్రారంభం కానుంది. కార్పొరేషన్ హోదాతో అదనపు నిధులు రావడమే కాకుండా, రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నా: జగన్

image

హైదరాబాద్‌లో NTV జర్నలిస్టుల <<18856335>>అరెస్టును<<>> YCP అధినేత జగన్ ఖండించారు. ‘పత్రికా స్వేచ్ఛ, ప్రజాస్వామ్య విలువలపై ఇది ప్రత్యక్ష దాడి. అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి, నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడం శోచనీయం. జర్నలిస్టులు ఉగ్రవాదులు కాదు. ఇలాంటి చర్యలు మీడియాలో భయాన్ని సృష్టిస్తాయి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలి. పత్రికా స్వేచ్ఛను కాపాడాలి. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు.