News December 19, 2025
ఖమ్మం: మహిళా డెయిరీ ద్వారా 20 వేల మందికి లబ్ధి

ఖమ్మం జిల్లాలో ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మూడేళ్లలో 20 వేల మందికి లబ్ధి చేకూర్చాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధికి నాణ్యమైన పాడి పశువులను అందించాలన్నారు. పాల ఉత్పత్తి పెంచేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ అనుదీప్, అదనపు కలెక్టర్ శ్రీజ పాల్గొన్నారు.
Similar News
News January 6, 2026
ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☆ జిల్లాలో పుష్కలంగా యూరియా స్టాక్: కలెక్టర్
☆ మధిర: తండ్రి చితికి తలకొరివి పెట్టిన తనయ
☆ కోడి పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: సీపీ
☆ గృహజ్యోతి పథకానికి ధరఖాస్తు చేసుకోండి: Dy.CM
☆ ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: కలెక్టర్
☆ ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేస్తాం: RTA వరప్రసాద్
☆ వెలుగుమట్ల పార్కుకు కొత్త పేరు సూచిస్తే.. రూ.4 వేలు
☆ ఖమ్మం: అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్: ACP
News January 6, 2026
‘ఖమ్మం జిల్లాలో యూరియా స్టాక్ పుష్కలంగా ఉంది’

ఖమ్మం జిల్లాలో యూరియా స్టాక్‌పై దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దని, జిల్లాలో యాసంగి సాగుకు అవసరమైన మేర స్టాక్ పుష్కలంగా అందుబాటులో ఉందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేందుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామన్నారు. ప్రస్తుతం జిల్లాలో 11,817 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటివరకు రైతులకు 25,773 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేశామని పేర్కొన్నారు.
News January 6, 2026
కోడిపందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు: ఖమ్మం సీపీ

కోడి పందేలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, చట్టాన్ని ఉల్లంఘించి ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలు జరగకుండా తీసుకుంటున్న చర్యలలో భాగంగా గతంలో కోడిపందేలు, పేకాట స్థావరాలు నిర్వహించిన వారిని బైండోవర్ చేయాలని పోలీసులను ఆదేశించారు. అదేవిధంగా కౌన్సిలింగ్ నిర్వహించాలని పేర్కొన్నారు.


