News December 19, 2025

చిత్తూరు: పెరిగిన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం

image

రిజిస్ట్రేషన్- స్టాంపుల శాఖ విడుదల చేసిన ఏప్రిల్-నవంబరు 2025 నివేదిక ప్రకారం చిత్తూరు జిల్లాలో లక్ష్యానికి మించి ఆదాయం సాధించింది. లక్ష్యం రూ.107.98 కోట్లు కాగా, రూ.111.57 కోట్ల మేర ఆదాయం ఆర్జించింది. గతేడాది ఇదే కాలంలో రూ.86.38 కోట్ల రెవెన్యూ మాత్రమే వచ్చింది. అంటే ఈసారి రెవెన్యూ 29శాతం ఎక్కువగా సాధించింది.

Similar News

News December 31, 2025

చిత్తూరు: పెన్షనర్లకు గమనిక

image

చిత్తూరు జిల్లాలోని పెన్షనర్లు కచ్చితంగా లైఫ్ సర్టిఫికెట్లు అందజేయాలని ట్రెజరీశాఖ DD రామచంద్ర సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగ విరమణ పొందిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కుటుంబ పెన్షన్‌దారులు వార్షిక జీవన ప్రమాణ ధ్రువీకరణ పత్రాన్ని అందజేయాలన్నారు. జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ లోపు లైఫ్ సర్టిఫికెట్లను ఇవ్వాలని.. గడువులోపు సమర్పించకపోతే మార్చి నెల పింఛన్ నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

News December 31, 2025

చిత్తూరు ఎంపీ పనితీరు ఇలా..!

image

చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాద రావు పార్లమెంట్ సమావేశాల్లో 94శాతం అటెండెన్స్ నమోదు చేశారు. ఇటీవల జరిగిన శీతాకాల సమావేశంలో ఏ రోజూ ఆయన పార్లమెంట్‌కు గైర్హాజరు కాలేదు. హెల్త్ సెక్యూరిటీ సెస్ బిల్లు, బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడారు. 7 చర్చల్లో పాల్గొన్న ఆయన ఇప్పటి వరకు 122 ప్రశ్నలను పార్లమెంట్‌లో సంధించారు. ఇప్పటి వరకు ఆయన ఎలాంటి ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టలేదు.

News December 31, 2025

చిత్తూరు: CC కెమెరాలతో 152 కేసుల పరిష్కారం

image

చిత్తూరు జిల్లా పోలీసులు 2025లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా 152 కేసులను పరిష్కరించారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 755 లొకేషన్లలో 2406 CC కెమెరాలను ఏర్పాటు చేశారు. దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు సంబంధించి CC కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం CC కెమెరాల ఏర్పాటుపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.