News December 19, 2025
విశాఖలో పర్యటించనున్న రక్షణ రంగ కమిటీ

రక్షణ రంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (2025-26) జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు కొచ్చి, బెంగళూరు, విశాఖపట్నం, భువనేశ్వర్, వారణాసి నగరాల్లో అధ్యయన పర్యటన చేపట్టనుంది. ఈ పర్యటనలో భాగంగా విశాఖపట్నంలోని NSTL ప్రతినిధులతో DRDO ప్రాజెక్టుల అప్‌గ్రేడేషన్‌పై, అదేవిధంగా కోస్ట్ గార్డ్ ప్రతినిధులతో తీరప్రాంత భద్రత, రక్షణ సన్నద్ధతపై కమిటీ సభ్యులు కీలక చర్చలు జరపనున్నారు.
Similar News
News January 1, 2026
విశాఖలో మందుబాబుల తాట తీసిన పోలీసులు

విశాఖలో పోలీసులు కొత్త సంవత్సరం వేళ మందుబాబులపై గురిపెట్టి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు 50చోట్ల ట్రాఫిక్ పోలీసులు బృందాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 240 మంది మద్యం సేవించినట్లు గుర్తించి కేసులు నమోదు చేశారు. వెంటనే వాహనాలు స్వాధీనం చేసుకొని స్టేషన్లకు తరలించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఇవాళ కూడా తనిఖీలు జరుగుతాయన్నారు.
News January 1, 2026
విశాఖలో ఒక్కరోజే రూ.9.90 కోట్ల మద్యం అమ్మకాలు

న్యూఇయర్ సందర్భంగా విశాఖలో మద్యం అమ్మకాలు ఊహించిన దానికంటే భారీగా నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజులోనే మద్యం అమ్మకాల ద్వారా రూ.9.90 కోట్ల ఆదాయం సమకూరింది. సాధారణంగా విశాఖలో రోజుకు రూ.5-6 కోట్ల వరకు ఆదాయం వస్తుంటే.. నిన్న అదనంగా రూ.3 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయి. నిన్న, ఈరోజు వైన్స్ షాపులకు అర్ధరాత్రి 12 గంటల వరకు, పబ్‌లు, ఈవెంట్లకు రాత్రి ఒంటిగంట వరకు మద్యం విక్రయాలకు ఎక్సైజ్ శాఖ అనుమతులు ఇచ్చింది.
News January 1, 2026
జీవన్‌దాన్ ద్వారా వారి జీవితంలో కొత్త వెలుగులు

రాష్ట్ర వైద్యరంగంలో మరో సరికొత్త రికార్డు నమోదయింది. 301 మందికి జీవన్‌దాన్ (అవయవ దానం) ద్వారా జీవితాల్లో వెలుగులు నింపారు. 2015 నుంచి ఇప్పటివరకు 1293 అవయవాలను సేకరించి అవసరమైన రోగులకు అందించామని విమ్స్ డైరెక్టర్ జీవన్‌దాన్ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ కే.రాంబాబు తెలిపారు. జీవన్‌దాన్ చేస్తున్న సేవలను రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్య కుమార్ యాదవ్ అభినందించారు.


