News December 19, 2025
KNR: వరుసగా చెక్ డ్యాంల ధ్వంసం.. చర్యలేవీ..?

చెక్ డ్యాంలను ఇసుక మాఫియా ధ్వంసం చేస్తుందా లేక నీటి ప్రవాహానికి కూలుతున్నాయా అనే విషయాన్ని అధికారులు తేల్చకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇసుక మాఫియా బ్లాస్ట్ చేశాయంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా ప్రభుత్వం విచారణ పేరుతో జాప్యం చేస్తుందన్న విమర్శలొస్తున్నాయి. నిన్న అడవిసోమన్పల్లి, ఇటీవల గుంపుల చెక్ డ్యాం కూలిన ఘటనలు రాజకీయ దుమారం రేపుతున్నా ఇసుక అక్రమ రవాణా కట్టడిపై చర్యలు లేకపోవడం గమనార్హం.
Similar News
News December 27, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 27, శనివారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.17 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.14 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.50 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.08 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 27, 2025
గుంటూరు- కాచిగూడ రైలు వేళల్లో మార్పులు

జనవరి 1 నుంచి గుంటూరు-కాచిగూడ రైలు (17251/52) సమయాల్లో మార్పులు చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
★ గుంటూరు-కాచిగూడ (17251): సా.5:30కు బదులు ఇకపై 6:40కు గుంటూరులో బయలుదేరి, మరుసటి రోజు ఉ.7:35కు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు రా.11:30కు నంద్యాలకు చేరుకుంటుంది.
★ కాచిగూడ-గుంటూరు (17252): రా.8:45కు కాచిగూడలో బయలుదేరి, మరుసటి రోజు ఉ.10:40కు గుంటూరు చేరుకుంటుంది. ఈ రైలు ఉ.5:20కు నంద్యాలకు వస్తుంది.
News December 27, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.


