News December 19, 2025
ఎన్నికల నిర్వహణలో కరీంనగర్ TOP..!

మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడంలో కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచినట్లు సోషల్ మీడియా వేదికగా రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశంసించింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు కృషిచేసిన జనరల్ అబ్జర్వర్ వెంకటేశ్వర్లు, DPO జగదీశ్వర్‌ను కలెక్టర్ సన్మానించారు. ఎన్నికల నిర్వహణలో విజయవంతంగా పనిచేసిన జిల్లా యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్, కలెక్టర్ అభినందించారు.
Similar News
News January 8, 2026
KU: డబుల్ పీజీ విద్యార్థులకు హాస్టల్ అడ్మిషన్లు రద్దు

డబుల్ పీజీ చదువుతున్న విద్యార్థులు యూనివర్సిటీ హాస్టల్స్ అడ్మిషన్లకు అర్హులు కాదని కేయూ హాస్టల్స్ డైరెక్టర్ ఎల్సీ రాజ్‌కుమార్ బుధవారం స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి హాస్టల్‌లో చేరిన విద్యార్థులు ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అడ్మిషన్ రద్దు చేసుకోవాలని సూచించారు. గడువు దాటితే హాస్టల్ అడ్మిషన్ రద్దుతో పాటు డిపాజిట్ మనీ తిరిగి చెల్లించనున్నట్లు పేర్కొన్నారు.
News January 8, 2026
భూపలపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంపై సమీక్ష

జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్‌లోని గురువారం కలెక్టర్ రాహుల్ శర్మ ఆధ్వర్యంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ గృహాల గృహ నిర్మాణాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై ఇందిరమ్మ గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను సూచించారు. మున్సిపల్, ఎంపిడివోలు, ఇంజనీరింగ్ అధికారులతో మాట్లదారు. అదనపు కలెక్టర్ విజయలక్మి, లోక్ నాయక్ ఉన్నారు.
News January 8, 2026
జిల్లా మలేరియా అధికారిగా నాగార్జున

జిల్లా మలేరియా నూతన అధికారిగా నాగార్జున గురువారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా వైద్యశాఖ అధికారి విజయమ్మను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అధికారుల ఆదేశాలను పాటిస్తూ తనకు కేటాయించిన లక్ష్యాలను సమర్ధవంతంగా నెరవేరుస్తానని ఆయన అన్నారు. నూతన వైద్యాధికారికి సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.


