News December 19, 2025

ఈనెల 20న జరగాల్సిన జాబ్ మేళా వాయిదా

image

జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఈనెల 20న పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తలపెట్టిన జాబ్‌మేళా అనివార్య కారణాలవల్ల వాయిదా వేస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో ఖాళీగా ఉన్న 150 పోస్టుల భర్తీకి ఈ మేళా చేపట్టారు. ఏదైనా డిగ్రీ, 18-45 ఏళ్ల వయసున్న వారు అర్హులని, నెలకు రూ.25 వేల వేతనం ఉంటుందన్నారు. తదుపరి తేదీ ప్రకటిస్తామని వెల్లడించారు.

Similar News

News December 28, 2025

SKLM: ప్రతిభకు జిల్లా ఎస్పీ ప్రశంస

image

జిల్లాలోని వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో ముఖ్యమైన కేసుల చేదన, గంజాయి పట్టివేత, గుడ్ వర్క్స్ వంటి అంశాల్లో చాకచక్యంగా వ్యవహరించి ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి అభినందించారు. ఎస్పీ కార్యాలయంలో సమీక్ష అనంతరం ఉత్తమ సేవలకు గాను సీఐలు పైడపు నాయుడు,(SKLM రూరల్) చంద్రమౌళి,(సీసీఎస్) సత్యనారాయణ (ఆమదాలవలస)తో పాటుగా పలువురు అధికారులకు ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు.

News December 27, 2025

సిద్దిపేట: ‘పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలి’

image

కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు అంతా కలిసికట్టుగా పనిచేయాలని పీసీసీ పరిశీలకులు మల్లాది పవన్, అన్సారీ పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేటలో జిల్లా అధ్యక్షురాలు ఆంజనేయులు ఆంక్ష రెడ్డి నేతృత్వంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఏర్పాటుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు కమిటీల నిర్మాణం కీలకమన్నారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పలు సూచనలు చేశారు.

News December 27, 2025

​హైదరాబాద్: వార్షిక నివేదిక.. రోడ్డు ప్రమాదాల వివరాలు

image

నగర రహదారులు నెత్తురోడుతున్నాయి. 2025 వార్షిక నివేదిక ప్రకారం.. నగరంలో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది 116గా ఉన్న ప్రాణాంతక ప్రమాదాలు ఈసారి 105కి తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయితే, మొత్తం 2,423 ప్రమాదాలు జరగగా, ఇందులో 109 మంది ప్రాణాలు కోల్పోయారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగే ప్రధాన కారణాలని పోలీసులు తేల్చారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం మోపుతూ 49,732 కేసులు నమోదు చేశారు.