News December 19, 2025
అనకాపల్లి: జిల్లా పోలీసులను అలర్ట్ చేసిన ఎస్పీ

అనకాపల్లిలో గురువారం కెనరా బ్యాంకులో దోపిడీకి విఫలయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా పరిగణిస్తోంది. బ్యాంకులో దొంగతనానికి యత్నించిన దుండగులను పట్టుకోవడానికి ఎస్పీ తుహిన్ సిన్హా ప్రత్యేక బృందాలను నియమించారు. సీసీ ఫుటేజీలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అనుమానితులపై ఆరా తీయాలని అలర్ట్‌గా ఉండాలని ఆదేశించారు.
Similar News
News January 18, 2026
HYD: మేడారం ‘బంగారం’ మీ ఇంటికే

మేడారం జాతర ప్రసాదం (బంగారం) ఇంటి వద్దకు పంపేందుకు HYD ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.299 చెల్లించిన వారికి ప్రసాదంతోపాటు వనదేవతల ఫొటోలు, పసుపు, కుంకుమ అందజేయనున్నారు. TGSRTC ఆన్‌లైన్‌లో భక్తులు తమ వివరాలు నమోదు చేయాలని ఆర్టీసీ HYD అధికారి భద్రినారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించి 9154298733, 9154298865 నంబర్లకు ఫోన్ చేయొచ్చన్నారు.
# SHARE IT
News January 18, 2026
MBNR: రేపే ఆఖరి తేదీ దరఖాస్తు చేసుకోండి

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా గ్రామీణ యువత స్వయం ఉపాధి కోసం SBI RSETY ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందిస్తోంది. రేపటి (19)వరకు సీసీటీవీ కెమెరా శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఉచిత భోజనం, వసతి కల్పించనున్నారు. 19 నుంచి 45 సం. వయస్సు గల పురుషులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. బండమీదిపల్లిలోని RSETY కేంద్రంలో లేదా 9963369361, 9542430607 నంబర్లలో సంప్రదించాలని ఆయన కోరారు.
News January 18, 2026
HYD: మేడారం బంగారం మీ ఇంటికే

మేడారం జాతర ప్రసాదం (బంగారం) ఇంటి వద్దకు పంపేందుకు HYD ఆర్టీసీ అధికారులు శ్రీకారం చుట్టారు. రూ.299 చెల్లించిన వారికి ప్రసాదంతోపాటు వనదేవతల ఫొటోలు, పసుపు, కుంకుమ అందజేయనున్నారు. TGSRTC ఆన్‌లైన్‌లో భక్తులు తమ వివరాలు నమోదు చేయాలని ఆర్టీసీ HYD అధికారి భద్రినారాయణ తెలిపారు. ఇందుకు సంబంధించి 9154298733, 9154298865 నంబర్లకు ఫోన్ చేయవచ్చన్నారు.
# SHARE IT


