News December 19, 2025

అన్నమయ్య: పదో తరగతి విద్యార్థులకు గమనిక

image

10వ తరగతి పరీక్ష ఫీజుల చెల్లింపునకు శుక్ర, శనివారం వరకు అవకాశం ఉందని అన్నమయ్య DEO సుబ్రహ్మణ్యంరెడ్డి వెల్లడించారు. రూ.500 ఫైన్‌తో విద్యార్థులు హెచ్ఎం లాగిన్ ద్వారా ఫీజు చెల్లించాలన్నారు. తక్కువ వయసున్న విద్యార్థులు వయసు మినహాయింపు ఫీజును బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్‌సైట్‌లో కట్టాల్సి ఉంటుందని సూచించారు. ఒకేషనల్ విద్యార్థులు సైతం అదే వెబ్ సైట్ నుంచి ఫీజు కట్టొచ్చని తెలిపారు.

Similar News

News January 19, 2026

నల్గొండ: కూతురి బర్త్ డే.. తల్లి మృతి

image

కుమార్తె పుట్టినరోజు వేళ ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. యాదగిరిగుట్ట మండలం మల్లాపురానికి చెందిన కర్రీ లాస్య సంక్రాంతికి వలిగొండ పులిగిల్లలోని తల్లిగారి పుట్టింటికి వచ్చింది. ఆదివారం తన పాప పుట్టినరోజు సందర్భంగా రామలింగేశ్వర స్వామి గుట్టకు దర్శనానికి వెళ్ళింది. అక్కడ గుండంలో కాళ్లుకడుగుతుండగా లాస్య జారిపడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News January 19, 2026

GNT: పైసల కోసం.. తండ్రి ప్రాణం తీశాడు..!

image

డబ్బు కోసం కన్న కొడుకే.. తండ్రిని రాయితో కొట్టి చంపిన ఘటన నల్లపాడు PS పరిధి రెడ్డిపాలెం మదర్ థెరిసాకాలనీలో జరిగింది. (60) దాటిన శేషుబాబు, అన్నపూర్ణ దంపతులు ఇప్పటికీ కూలీ పనులు చేసుకొని బతుకుతున్నారు. వారి చిన్న కుమారుడు సాయి నాగగణేశ్ మద్యం తాగొచ్చి దాచుకున్న డబ్బు ఇవ్వాలని తల్లితో గొడవపడి కొడుతుండగా.. తండ్రి అడ్డు వెళ్లాడు. ఈ క్రమంలో రాయితో కొట్టి తండ్రిని హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News January 19, 2026

వణికిపోతున్న విశాఖ ప్రజలు

image

సాగర తీర ప్రాంతాలన్నీ మంచు తెరలతో నిండిపోయాయి. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో జనం బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే పొగమంచు ధాటికి ప్రధాన రహదారులు ఏమాత్రం కనిపించడం లేదు. హనుమంతవాక హైవే, బీచ్ ప్రాంతాలు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో 12-14 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు వణికిపోతున్నారు. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి ఉండే అవకాశముంది.