News December 19, 2025

నాగర్‌కర్నూల్‌ను వణికిస్తున్న చలి

image

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో అత్యల్పంగా 9.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లిలో 10.4, తోటపల్లిలో 10.5, అమ్రాబాద్‌లో 10.6, లింగాలలో 10.9 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరిగిన చలితో జిల్లా ప్రజలు గజగజ వణికిపోతున్నారు.

Similar News

News January 15, 2026

కోడి పందెం శాస్త్రం.. వారానికి ఒక రంగు

image

కోడి పందేలలో వారాన్ని బట్టి రంగులకు, రోజును బట్టి దిశలకు ప్రాధాన్యం ఉందని పందెం రాయుళ్లు నమ్ముతారు.
ఆది, మంగళవారాల్లో డేగ రంగు కోళ్లు, సోమ, శనివారాల్లో నెమలి రంగు కోళ్లు, బుధ, గురువారాల్లో కాకి రంగు కోళ్లు గెలుపు సాధిస్తాయని అంచనా. అలాగే బరిలో కోడిని దింపే దిశ కూడా కీలకం. భోగి నాడు ఉత్తర దిశ నుంచి, సంక్రాంతి నాడు తూర్పు దిశ నుంచి, కనుమ నాడు దక్షిణ దిశ నుంచి వదిలితే విజయం వరిస్తుందని శాస్త్రం.

News January 15, 2026

మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

image

మెనోపాజ్‌ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్‌ స్వింగ్స్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.

News January 15, 2026

ఇకపై గ్రోక్‌లో బికినీ ఫొటోలు రావు!

image

AI చాట్‌బాట్ గ్రోక్ ద్వారా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్నారన్న ఫిర్యాదులపై X స్పందించింది. ఇకపై వ్యక్తుల చిత్రాలను బికినీలు లేదా అసభ్య దుస్తుల్లోకి మార్చకుండా టెక్నికల్‌గా మార్పులు చేసింది. భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, కాలిఫోర్నియాలో విచారణ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను తొలగించి, 3500 పోస్టులను బ్లాక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.