News December 19, 2025
పి.గన్నవరంలో యాక్సిడెంట్.. యువకుడు మృతి

పి. గన్నవరం కొత్త బ్రిడ్జి సమీపంలో శుక్రవారం వేకువ జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందినట్లు ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. కొత్తపేట మండలంలోని అవిడికి చెందిన సుమంత్ కుమార్ (25) గన్నవరం సెంటర్‌కు వచ్చే సమయంలో బైక్ అదుపుతప్పడంతో ప్రమాదానికి గురైనట్లు తెలిపారు. అతడు అక్కడికక్కడే మృతి చెందగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Similar News
News January 17, 2026
NRPT: వార్డుల వారీగా రిజర్వేషన్ల ఖరారు

2వ మున్సిపల్ సాధారణ ఎన్నికలు–2025 నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు శనివారం నారాయణపేట పురపాలక సంఘం పరిధిలోని 24 వార్డులకు సంబంధించిన వార్డు మెంబర్ల రిజర్వేషన్లను ఖరారు చేశారు. జిల్లా ఎన్నికల అథారిటీ, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ST, SC, BC, జనరల్ రిజర్వేషన్లు నిర్వహించగా, మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో తీశారు.
News January 17, 2026
విశాఖ: పెళ్లై ఏడాది.. ప్రమాదంలో మహిళ మృతి

ఎంవీపీలో ఉంటున్న రమా హిమజ(27)కు గత ఏడాది నవంబర్‌లో వివాహం అయ్యింది. పండుగ సందర్భంగా
నూతన వధూవరులు విశాఖలోని అత్తారింటికి వచ్చారు. శుక్రవారం అన్నవరం వెళ్లి తిరిగి వస్తుండగా ఎన్ఏడీ జంక్షన్ వద్ద రాత్రి 11:30గంటల సమయంలో కారు టైరు పేలి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమా హిమజ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. విశాఖలో ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.
News January 17, 2026
సంగారెడ్డి: రోడ్డు భద్రతపై ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం

రోడ్డు ప్రమాదాల నివారణకు ‘అరైవ్ అలైవ్ – 2026’ పేరిట 10 రోజుల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. పోలీస్, రవాణా, ఆరోగ్య శాఖల సమన్వయంతో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని, ప్రాణ రక్షణే ఈ ఉద్యమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.


