News December 19, 2025
ఎప్‌స్టీన్ ఫైల్స్: ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’

అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్‌స్టీన్ <<18547375>>ఎస్టేట్<<>>లోని మరిన్ని ఫొటోలను US హౌస్ డెమొక్రాట్ల కమిటీ రిలీజ్ చేసింది. మొత్తం 68 ఫొటోల్లో బిల్ గేట్స్, నోవమ్ చోమ్‌స్కీ, వూడీ అలెన్ వంటి వాళ్లు ఉన్నారు. ‘ఇప్పుడే అమ్మాయిలను పంపుతా’ అంటూ ఉన్న మెసేజీలు, పేర్లు బ్లర్ చేసిన రష్యా, లిథువేనియా, ఉక్రెయిన్ దేశాల మహిళల పాస్‌పోర్టులూ ఉన్నాయి. కమిటీ వద్ద మొత్తం 95 వేల ఇమేజెస్ ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News January 18, 2026
Friendflationతో ఒంటరవుతున్న యువత!

ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ఫ్రెండ్‌ఫ్లేషన్‌గా మారి యువతను ఒంటరి చేస్తోంది. పెరిగిన హోటల్ బిల్లులు, సినిమా టికెట్లు, పెట్రోల్ ఖర్చుల భయంతో మెట్రో నగరాల్లోని యువత బయటకు వెళ్లడం తగ్గించేస్తున్నారు. ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఖర్చు భరించలేక చాలామంది ఇన్విటేషన్లను సున్నితంగా తిరస్కరిస్తున్నారు. పార్కులు, ఇంటి దగ్గర చిన్నపాటి మీటింగ్స్ వంటి లో-కాస్ట్ ప్లాన్స్‌తో స్నేహాన్ని కాపాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News January 18, 2026
జోరందుకున్న మద్యం అమ్మకాలు

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని రాష్ట్రంలో మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ నెల 9వ తేదీ నుంచి 16 వ తేదీ వరకు సాధారణ రోజులతో పోల్చితే రెట్టింపు బిజినెస్ జరిగినట్లు సమాచారం. ప్రతి రోజూ రూ.85 కోట్ల లిక్కర్ సేల్ జరిగినట్లు లెక్కలు వెల్లడించాయి. ఈ వారం వ్యవధిలో రూ.877 కోట్ల మేర విక్రయాలు జరిగినట్లు చెప్పాయి. పండుగ 3 రోజుల్లో రూ.438 కోట్ల విలువైన మద్యం అమ్ముడైనట్లు తెలిపాయి.
News January 18, 2026
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<


