News December 19, 2025

రంగారెడ్డి: పల్లే పోరులో బీసీలదే హవా!

image

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో జరిగిన GP ఎన్నికల్లో బీసీ అభ్యర్థులదే హవా కొనసాగింది. జనరల్ స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలో 525 జీపీలకు 92 స్థానాలు బీసీలకు కేటాయించగా 198 బీసీ అభ్యర్థులు విజయం సాధించారు. జనరల్ స్థానాల్లో 106 మంది గెలుపొందారు. VKBలో 594 జీపీలకు107 స్థానాలకు 219 స్థానాల్లో గెలుపొందారు. 112 జనరల్ స్థానాల్లో బీసీ అభ్యర్థులు సత్తాచాటారు.

Similar News

News January 17, 2026

మంచిర్యాల: బీసీకే మొదటి మేయర్ పీఠం

image

ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద పట్టణంగా గుర్తింపు పొందిన మంచిర్యాల మున్సిపాలిటీలో నస్పూర్‌తో పాటు మరో 8 జీపీలను విలీనం చేసి కార్పొరేషన్‌గా మార్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఈ పీఠం ఎవరికి దక్కబోతోందన్న దానిపై ఉత్కంఠ వీడింది. మొదటి మేయర్ పీఠాన్ని BC జనరల్‌కు కేటాయించారు. దీంతో సీటు ఆశించిన జనరల్ అభ్యర్థులకు నిరాశ ఎదురైంది. మొత్తం 60 డివిజన్లతో ఏర్పాటైన కార్పొరేషన్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందో చూడాలి.

News January 17, 2026

నల్గొండ తొలి మేయర్‌గా ‘ఆమె’

image

నల్గొండ కార్పొరేషన్ మేయర్ పదవి రిజర్వేషన్ ఖరారైంది. ప్రభుత్వం ఈ పదవిని ‘జనరల్ మహిళ’కు కేటాయిస్తూ గెజిట్ విడుదల చేయడంతో జిల్లా రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. మహిళా సాధికారతకు ఇది నిదర్శనమని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ ఖరారు కావడంతో రాజకీయ పార్టీలు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడ్డాయి. ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ వ్యూహాలకు పదును పెడుతున్నారు.

News January 17, 2026

NGKL: రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించండి: సీఎం

image

రాబోయే మున్సిపల్ ఎన్నికలలో మనోళ్లను గెలిపించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాలలో అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపించామని, మరింత అభివృద్ధి కావాలంటే ప్రజలందరూ నన్ను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.