News April 21, 2024

ఉమ్మడి జిల్లాలో రెండు రోజులు KCR రోడ్ షోలు

image

BRS అధినేత KCR జిల్లాల పర్యటనలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు. ఈనెల 26న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సాయంత్రం నిర్వహించే రోడ్ షోలో పాల్గొని రాత్రికి అక్కడే బస చేయనున్నారు. మరుసటి రోజు 27 సాయంత్రం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నిర్వహించే రోడ్ షోలో కేసీఆర్ పాల్గొన్ననున్నట్లు జిల్లా బీఆర్ఎస్ నేతలు తెలిపారు.

Similar News

News March 31, 2026

పాలమూరు: జాబ్ మేళా.. 120 మంది హాజరు

image

మహబూబ్ నగర్ లోని ఎంప్లాయ్మెంట్ కార్యాలయంలో ఇవాళ జాబ్ మేళా నిర్వహించినట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారిణి మైత్రిప్రియ ‘Way2News’ ప్రతినిధితో తెలిపారు. 6 సంస్థలలో మొత్తం 500 ఉద్యోగ ఖాళీల కోసం వివిధ జిల్లాల నుంచి దాదాపుగా 120 మంది నిరుద్యోగులు హాజరయ్యారన్నారు. వారిలో షార్ట్ లిస్టు తీసి.. అర్హులైన విద్యార్థులకు ఆఫర్ లెటర్ అందించినట్లు పేర్కొన్నారు. వివిధ సంస్థల సభ్యులు, నిరుద్యోగులు పాల్గొన్నారు.

News March 31, 2026

MBNR: ఏప్రిల్ 1 నుంచి అంబేడ్కర్ వర్సిటీ ప్రయోగ పరీక్షలు

image

మహబూబ్‌నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఏప్రిల్ 1 నుంచి మొదటి సెమిస్టర్ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. విద్యార్థులు హాల్ టికెట్, ఐడీ కార్డు వెంట తెచ్చుకోవాలని రీజినల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ గౌడ్ సూచించారు. వివరాలకు 73829 29609 నంబరును సంప్రదించవచ్చు.

News March 31, 2026

MBNR: వడదెబ్బతో వ్యవసాయ కూలీ మృతి

image

మిడ్జిల్ మండలం దోనూర్ గ్రామానికి చెందిన గుద్దేటి బజార్ (48) వృత్తి రీత్యా వ్యవసాయ కూలీ, సోమవారం కానుగు విత్తనాల సేకరణ కోసం వెళ్లి వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు మహబూబ్‌నగర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి.