News December 19, 2025
రాజంపేటలో CM హామీ ఇచ్చిన చోటే..!

రాజంపేటను అన్నమయ్య జిల్లా కేంద్రంగా చేస్తామని హామీ ఇచ్చిన చోటే శుక్రవారం ప్రజాగర్జన నిర్వహించడానికి జేఏసీ రంగం సిద్ధం చేసింది. జిల్లా కేంద్రం విషయంలో రాజంపేటకు అన్యాయం జరిగిందని, తాము న్యాయం చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అదే ప్రాంతంలో నిర్వహించనున్న గర్జన సభకు కోడూరు, రాజంపేట నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు, నేతలు తరలి రానున్నారు.
Similar News
News January 16, 2026
ట్రంప్ కొంతైనా ‘శాంతి’స్తారా?

అధికారికంగా కాకపోయినా ట్రంప్ చేతికి <<18868941>>నోబెల్ పీస్ ప్రైజ్<<>> అందింది. దీంతో కొంతైనా శాంతించి ఉంటారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు మచాడో వెనిజులా అధ్యక్షురాలు అవుతారని కొందరు, ఆమెకు ఇచ్చిన బహుమతిని వెనక్కి తీసుకోవాలని మరికొందరు స్పందిస్తున్నారు. కాగా తనకు కాకుండా వెనిజులాకు చెందిన వ్యక్తికి నోబెల్ ప్రైజ్ రావడంతోనే ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడిని అరెస్ట్ చేశారని ట్రంప్‌పై తీవ్ర విమర్శలొచ్చాయి.
News January 16, 2026
ఆసిఫాబాద్: గురుకుల ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదల

2026-27 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రంలోని వివిధ గురుకుల పాఠశాలల్లో (5, 6-9 తరగతులు) ప్రవేశాలకు ఉమ్మడి ప్రకటన విడుదలైంది. ఆసక్తి గల విద్యార్థులు డిసెంబర్ 11 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు ఆధార్, బోనఫైడ్, కుల, ఆదాయ పత్రాలు అవసరం. ఈ అవకాశాన్ని కొమురం భీం జిల్లా విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
News January 16, 2026
ముంబై పీఠం ఎవరిది.. నేడే కౌంటింగ్

ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికల ఫలితాలు నేడు 10am నుంచి వెలువడనున్నాయి. మొత్తం 227 వార్డులకు జరిగిన ఎన్నికల్లో సుమారు 46-50% పోలింగ్ నమోదైనట్లు EC తెలిపింది. BJP నేతృత్వంలోని మహాయుతి కూటమి విజయం సాధిస్తుందని <<18867305>>ఎగ్జిట్ పోల్స్<<>> అంచనా వేశాయి. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో కౌంటింగ్‌పై ఉత్కంఠ నెలకొంది. మేయర్ పీఠం కైవసం చేసుకోవడానికి 114 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.


