News December 19, 2025
ప్రతి నెలా BRSకు రూ.5వేలు.. మేం పార్టీ మారలేదు: ఎమ్మెల్యేలు

TG: పార్టీ ఫిరాయింపు అంశంపై పలువురికి క్లీన్ చిట్ ఇస్తూ స్పీకర్ ప్రసాద్ ఇచ్చిన ఆర్డర్ కాపీలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతినెలా తమ జీతం నుంచి BRS LPకి ₹5వేలు చెల్లిస్తున్నామని మహిపాల్, కాలె యాదయ్య, ప్రకాశ్ గౌడ్ స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో BRSకు డబ్బులిస్తున్నప్పుడు పార్టీ మారినట్లు భావించలేమని స్పీకర్ వెల్లడించారు. ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు అఫిడవిట్ కాపీలో పొందుపరిచారు.
Similar News
News January 15, 2026
మెనోపాజ్‌లో ఒత్తిడి ప్రభావం

మెనోపాజ్ దశలో శరీరంలో తలెత్తే హార్మోన్ల మార్పుల కారణంగా మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది. దీంతో ఒత్తిడి, ఆందోళన, చిరాకు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని అధిగమించే మార్గాల గురించి నిపుణులను, తోటి మహిళలను అడిగి తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి నచ్చిన పనులు చేయడం, కంటి నిండా నిద్ర పోవడం వంటివి చేయాలని సూచిస్తున్నారు.
News January 15, 2026
ఇకపై గ్రోక్‌లో బికినీ ఫొటోలు రావు!

AI చాట్‌బాట్ గ్రోక్ ద్వారా మహిళలు, పిల్లల ఫొటోలను అశ్లీలంగా మారుస్తున్నారన్న ఫిర్యాదులపై X స్పందించింది. ఇకపై వ్యక్తుల చిత్రాలను బికినీలు లేదా అసభ్య దుస్తుల్లోకి మార్చకుండా టెక్నికల్‌గా మార్పులు చేసింది. భారత ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం, కాలిఫోర్నియాలో విచారణ ప్రారంభం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. నిబంధనలు ఉల్లంఘించిన 600 అకౌంట్లను తొలగించి, 3500 పోస్టులను బ్లాక్ చేసినట్లు సంస్థ వెల్లడించింది.
News January 15, 2026
రాజాసాబ్ నిర్మాతతో పవన్ కొత్త ప్రాజెక్టులు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’, ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. కథలు, కంటెంట్, కొత్త ఆలోచనలపై చర్చలు కొనసాగినట్లు PKCW వెల్లడించింది. బలమైన, అర్థవంతమైన కథలను అందించడమే లక్ష్యమని విశ్వప్రసాద్ తెలిపారు.


