News April 21, 2024
టీడీపీ నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా రామరాజు

టీడీపీ నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉండి MLA మంతెన రామరాజును నియమిస్తూ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు నరసాపురం పార్లమెంట్ అధ్యక్షురాలిగా ఉన్న సీతారామలక్ష్మిని పొలిట్ బ్యూరో సభ్యురాలు, ఉమ్మడి ప.గో జిల్లా ఎన్నికల సమన్వయకర్తగా నియమించారు. ఉండి టీడీపీ టికెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించడంతో మంతెన రామరాజును నరసాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా నియమించారు.
Similar News
News January 29, 2026
ప.గో: బొలిశెట్టి, తోట గోపి సమన్వయం – 1/2

తాడేపల్లిగూడెంలో <<18993317>>జనసేన రాజకీయంగా దూకుడు పెంచింది<<>>. ఎమ్మెల్యే బొలిశెట్టి , నాయకుడు తోట గోపి పరస్పర సహకారంతో పార్టీని బలోపేతం చేస్తున్నారు. వీరిద్దరూ నాణేనికి బొమ్మ బొరుసులా వ్యవహరిస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మరోవైపు వైకాపా, టీడీపీలోని అంతర్గత విభేదాలు జనసేనకు కలిసివస్తున్నాయి. ఈ పరిణామాలతో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన ప్రభావం కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News January 29, 2026
తాడేపల్లిగూడెంలో జనసేన జోరు -1

తాడేపల్లిగూడెంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. వైకాపాలో మాజీ మంత్రి కొట్టు సత్యానారాయణ, ప్రస్తుత ఇన్‌ఛార్జ్ వడ్డి రఘురాం వర్గాల మధ్య విభేదాలు, తాజా సమావేశానికి కొట్టు గైర్హాజరు కావడం చర్చనీయాంశమైంది. అటు టీడీపీలోనూ వలవల బాబ్జి, పసల కొండ వర్గాల నడుమ అసంతృప్తి నెలకొంది. ప్రధాన పార్టీల్లోని ఈ అంతర్గత కలహాలను తమకు అనుకూలంగా మలచుకుంటూ జనసేన క్షేత్రస్థాయిలో దూకుడు పెంచింది.
News January 29, 2026
ఉగాది నాటికి 9,135 గృహాల పూర్తి: కలెక్టర్ ఆదేశం

పశ్చిమ గోదావరి జిల్లాలో గృహ నిర్మాణ ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి గురువారం పెదమిరం క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు వచ్చే ఉగాది నాటికి 9,135 గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని ఆమె ఆదేశించారు. గూగుల్ మీట్ ద్వారా జరిగిన ఈ సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ పిచ్చయ్య పాల్గొన్నారు.


