News December 19, 2025
క్లెయిమ్ చేయని ఆస్తులపై 20న అవగాహన శిబిరం

క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల కోసం డిసెంబర్ 20న నల్గొండ కలెక్టరేట్ కార్యాలయ ఉదయాదిత్య భవనంలో ఉమ్మడి శిబిరం నిర్వహిస్తున్నారు. క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తుల వాస్తవ యజమానులు వాటిని పొందేందుకు.. బ్యాంకు శాఖ, భీమా సంస్థ, మ్యూచువల్ ఫండ్ సంస్థ, శిబిరంలోని స్టాక్ బ్రోకరేజీ సంస్థ, ఆన్‌లైన్ ద్వారా స్టాక్ బ్రోకర్‌లలో దేనినైనా సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు.
Similar News
News January 24, 2026
ఏటేటా పడిపోతున్న కూరగాయల సాగు

జిల్లాలో కూరగాయ పంటలు, ఆకు కూరల సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోతుంది. NLG నగరం మూడువైపులా శరవేగంగా విస్తరిస్తుండడం, వ్యవసాయ భూములు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిపోతుండడం, మరోవైపు ప్రభుత్వపరంగా ఉద్యాన రైతులకు సహాయ సహకారాలు కొరవడటంతో ఈ పరిస్థితి ఏర్పడుతున్నది. దశాబ్ద కాలం క్రితం జిల్లాలో వందల ఎకరాలకుపైబడి విస్తీర్ణంలో వివిధ రకాల కూరగాయ పంటలు సాగయ్యేవి. ఇప్పుడు 30 శాతం కూడా సాగు చేయడం లేదు.
News January 24, 2026
NLG: సన్న బియ్యం ధరలకు రెక్కలు

నల్గొండ జిల్లాలో సామాన్యులకు సన్నబియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఏటేటా బియ్యం రెట్టింపు అవుతున్నా అధికారులు కట్టడి చేయడం లేదు. గడిచిన నాలుగైదేండ్లుగా ఏటా వానకాలం సీజన్‌లో మిల్లుల వద్ద క్వింటా బియ్యం రూ.3వేల నుంచి రూ.3500 వరకు దొరికేది. ఈ ఏడాది గత పరిస్థితులకు భిన్నంగా వాటి ధరలు మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బీపీటీ బియ్యం క్వింటా ధర కొత్తవి రూ.5,500, పాతవి రూ.6,000 పలుకుతున్నాయి.
News January 24, 2026
NLG: ‘అహల్య’ వాగు కాదు నది!

‘అహల్య’ అనగానే పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది మూవీలోని కామెడీ గుర్తోస్తుంది. కానీ నల్గొండ జిల్లాలో ‘అహల్య’ నది ఫేమస్. కానీ ఇది నేటి తరానికి తెలియదు. ఆ నది పేరు మీదుగానే ఆ గ్రామానికి పేరొచ్చింది.. అదే హాలియా. చరిత్ర క్రమంలో నది పూడిపోయి, ఆక్రమణకు గురికావడం వల్ల ప్రస్తుతం అహల్య వాగుగా మారింది. ఈ వాగు ఒడ్డునే హాలియా పట్టణం విస్తరించి ఉంది. చుట్టుపక్కల వ్యవసాయానికి ఈ వాగు ప్రధాన నీటి వనరు.


