News April 21, 2024
ఐపీఎల్.. NEXT లెవెల్

287, 277, 272, 266.. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక స్కోర్లు. ఇవన్నీ ఈ సీజన్‌లోనే నమోదవడం మరో విశేషం. ఇలాంటి స్కోర్లు ఒకప్పుడు వన్డేల్లో మ్యాచ్ విన్నింగ్ టోటల్స్. ఇప్పటికీ కొన్ని మ్యాచుల్లో ఆ స్కోర్లు జట్లకు విజయాన్ని కట్టబెడుతున్నాయి. కానీ ఇప్పుడు T20ల్లో 250+ స్కోర్లు సాధారణమయ్యాయి. 300+ రన్స్ కొట్టడం ఎంతో దూరంలో లేదనిపిస్తోంది. దీంతో మన ఐపీఎల్.. NEXT లెవెల్ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News March 10, 2026
వంటగ్యాస్ పొదుపుగా వాడుకుంటే బెటర్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. కేంద్రం భరోసా ఇచ్చినా బిహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో LPG కొరత కనిపిస్తోంది. గ్యాస్ కోసం భారత్ ప్రధానంగా గల్ఫ్ దేశాలపైనే ఆధారపడుతోంది. దేశంలో చమురు తరహాలో LPGని భారీగా నిల్వ చేసే సామర్థ్యం లేదు. ఈ ఛాలెంజెస్ దృష్ట్యా ప్రస్తుత పరిస్థితుల్లో వంటగ్యాస్‌ను పొదుపుగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News March 10, 2026
యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది: IRGC

త్వరలో యుద్ధం ముగుస్తుందన్న <<19341728>>ట్రంప్ కామెంట్లపై<<>> ఇరాన్ IRGC స్పందించింది. ‘యుద్ధం ముగించడం మా చేతుల్లో ఉంది’ అని స్పష్టం చేసింది. ‘ఈ ప్రాంత భవిష్యత్ ఎలా ఉండాలో నిర్ణయించేది సాయుధ బలగాలు. అమెరికా సైనికులు యుద్ధాన్ని ముగించలేరు. మేము పూర్తి శక్తితో యుద్ధం చేస్తున్నాం. మాపై ఆధిపత్యం ప్రదర్శించామని ట్రంప్ అబద్ధాలు చెబుతున్నారు’ అని మండిపడింది.
News March 10, 2026
Viral: పిలవని పేరంటానికి వెళ్తే జైలు శిక్ష!

TG: ఆహ్వానం లేకుండా ఫంక్షన్‌కు వస్తే చర్యలు తప్పవని మహబూబాబాద్‌కు చెందిన హాల్ యజమాని బోర్డు పెట్టడం వైరల్‌గా మారింది. కొందరు ఇన్విటేషన్ లేకున్నా వస్తుండటంతో చాలా మంది తమ హాల్‌లో ఫంక్షన్లు చేయట్లేదని, దీంతో గిరాకీ తగ్గిందని ఆయన చెప్పారు. దీన్ని నివారించేందుకే ఫంక్షన్ హాల్ ఎదుట.. ‘ఆహ్వానం లేకుండా ఎవరైనా వస్తే 441 సెక్షన్ కింద 3నెలల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధిస్తాం’ అని బోర్డు పెట్టారు.


