News December 19, 2025

సంగారెడ్డి:ఈనెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఈ నెల 22 నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈఓ వెంకటేశ్వర్లు ఆదేశించారు. ఆయన శుక్రవారం మాట్లాడుతూ.. ఈ నెల 22, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయులకు,29,30 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎంఈవోలకు సూచించారు.

Similar News

News January 19, 2026

అన్నమయ్య: ఇందులో మీ ల్యాప్‌టాప్ ఉందా?

image

అన్నమయ్య జిల్లాలో ల్యాప్‌టాప్‌ దొంగ నరేశ్‌ను <<18897096>>అరెస్ట్ <<>>చేసిన విషయం తెలిసిందే. నిందితుడు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఖర్చుల కోసం రెండేళ్లుగా తిరుపతి-బెంగళూరు, రాయచోటి-బెంగళూరు బస్సుల్లో దొంగతనాలు చేస్తున్నాడు. పోలీసులు అరెస్ట్ చేసి అతని ఇంట్లో సోదాలు చేశారు. 23 ల్యాప్‌టాప్‌లు దొరికాయి. మీలో ఎవరిదైనా ల్యాప్‌టాప్ పోయినట్లైతే సంబంధిత ఆధారాలను సంబేపల్లి పోలీస్ స్టేషన్‌లో చూపించి వీటిని తీసుకోవచ్చు.

News January 19, 2026

మహిళలపై నిందలు, డ్రెస్సింగ్‌పై రూల్స్ కరెక్ట్ కాదు: రేణుకా చౌదరి

image

TG: మంత్రులు, మహిళా అధికారులపై నిందలు మోపడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేత, MP రేణుకా చౌదరి అన్నారు. మహిళలను కించపరుస్తూ కొందరు SMలో పోస్టులు పెడుతున్నారని ఓ ఇంటర్వ్యూలో మండిపడ్డారు. మహిళల డ్రెస్సింగ్ వివాదంపైనా ఆమె స్పందించారు. ‘ఆడవాళ్లు ఏం వేసుకోవాలో మీరెలా డిసైడ్ చేస్తారు. ఇలాంటి రూల్స్ మీ ఇంట్లో వాళ్లకి పెట్టుకోండి’ అని అన్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి తానే పోటీ చేస్తానని చెప్పారు.

News January 19, 2026

నంద్యాల కలెక్టరేట్‌లో 138 అర్జీల స్వీకరణ

image

నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 138 దరఖాస్తులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. ప్రజలు సమర్పించిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న అర్జీలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.