News December 19, 2025

KNR: జనరల్ స్థానాల్లోనూ BCల వి’జయ’కేతనం

image

రాష్ట్రంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లోనూ బీసీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1,223 గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహించారు. కాగా, వీటిల్లో 308 స్థానాలు బీసీలకు కేటాయించారు. అయితే 573 జనరల్ స్థానాల్లో 374 మంది బీసీ అభ్యర్థులు గెలవడంతో మొత్తం 682 మంది బీసీ అభ్యర్థులు గెలిచారు. ఈ లెక్కన 55.76% మంది బీసీ అభ్యర్థులు గ్రామపాలకులు కానున్నారు.

Similar News

News December 31, 2025

తలరాతను మార్చిన చదువు.. తల్లిదండ్రులకు అద్భుత బహుమతి

image

మహారాష్ట్రలో గొర్రెల కాపర్ల కుటుంబంలో పుట్టి IPS ఆఫీసర్ అయిన బర్దేవ్ సిద్ధప్ప గుర్తున్నారా? ఇల్లు కూడా లేని ఆయన బీటెక్ పూర్తి చేసి 2024లో యూపీఎస్సీ ఫలితాల్లో IPSగా ఎంపికయ్యారు. ఆ కమ్యూనిటీ నుంచి IPS అయిన తొలి వ్యక్తిగా రికార్డు అందుకున్నారు. తాజాగా తన తల్లిదండ్రులను, ఆత్మీయులను విమానం ఎక్కించారు. విమానం గురించి చిన్నప్పుడు కలలు కనేవాడినని, ఇప్పుడు నిజమైందని సిద్ధప్ప ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.

News December 31, 2025

NLG: ఈ ‘పాప’o ఎవరిది?

image

పడక సుఖమే కారణమో లేక.. పెంచాలేనన్న భయమో తెలీదు కానీ గర్భస్థ <<18720257>>ఆడ శిశువు<<>>ను మురికి కాల్వలో పడేసింది ఓ తల్లి. నెలలు నిండని ఆ శిశువు ఉక్కిరిబిక్కిరై కాల్వలోనే ఊపిరి వదిలింది. మిర్యాలగూడలో జరిగిన ఈ అమానుష ఘటన అమ్మతనానికే కలంకం తెచ్చింది. పెంచే స్తోమత లేకుంటే బిడ్డ పుట్టాక ప్రభుత్వ సంరక్షణ కేంద్రాల్లో చేర్చడం, అధికారిక దత్తతపై అవగాహన కల్పిస్తున్నా కర్కశ తల్లి మనసు కరగకపోవడం స్థానికులను కలచి వేసింది.

News December 31, 2025

నల్గొండ: ‘ఇలా’ వచ్చి.. ‘అలా తనదైన ముద్ర వేశారు’

image

14 నెలల పదవీకాలంలో కలెక్టర్‌గా ఇలా త్రిపాఠి జిల్లాలో తనదైన ముద్రవేశారు. 2024 అక్టోబరు 28న ఇలా త్రిపాఠి కలెక్టర్‌గా నియమితులయ్యారు. నిత్యం జిల్లాలో ఏదో ఒక ప్రాంతాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మమేకమవడమే గాక పలు పథకాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రధానంగా విద్యాభివృద్ధి, మారుమూల గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవల కోసం ఆమె ప్రత్యేకంగా కృషి చేశారు.