News December 19, 2025
RJY: విద్యార్థునులతో నారా లోకేశ్ సెల్ఫీ

మంత్రి లోకేశ్ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో రాజమండ్రి సిటీలోకి చేరుకున్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో క్వారీ మార్కెట్ జంక్షన్ వద్ద స్వాగతం పలికారు. పార్టీ జెండాలు, డప్పులు, బాణసంచా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ప్రతిభ కళాశాల విద్యార్థులతో నారా లోకేశ్ సెల్ఫీ దిగారు.
Similar News
News January 17, 2026
గద్వాల జిల్లాలో మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్లు ఇలా..!

గద్వాల జిల్లాలో గద్వాల అయిజ వడ్డేపల్లి అలంపూర్ 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రభుత్వం మున్సిపల్ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. శనివారం వార్డులు, ఛైర్మన్ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించింది. గద్వాల ఛైర్మన్ స్థానం జనరల్ మహిళకు కేటాయించింది. అయిజ, వడ్డేపల్లి, అలంపూర్ మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను బీసీ జనరల్‌కు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
News January 17, 2026
పురుషులకూ ఫ్రీ బస్సు: AIADMK

రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు AIADMK తొలి విడత మ్యానిఫెస్టో ప్రకటించింది. రేషన్ కార్డు ఉన్న మహిళలకు ప్రతి నెలా రూ.2వేలు, సిటీ బస్సుల్లో పురుషులకూ ఫ్రీ జర్నీ, ఇల్లు లేని వారికి ఉచిత ఇళ్ల నిర్మాణం, ఉపాధి హామీ పని దినాలు 150కి పెంపు, 5 లక్షల మంది మహిళలకు టూ వీలర్ స్కీమ్ కింద రూ.25వేల సబ్సిడీ వంటి హామీలను ప్రకటించింది.
News January 17, 2026
REWIND: 1947-77 నాగోబా జాతర దృశ్యం

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో 1947 నుంచి ఆదివాసీ మెస్రం వంశీయుల ఆరాధ్యదైవం శ్రీ నాగోబా దేవత పుణ్యక్షేత్రం వెలిసింది. ఆనాటి నుంచి మెస్రం వంశీయులు ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తూ తమ సంప్రదాయాన్ని కాపాడుతున్నారు. ఏటా పుష్య మాసాన్ని పురస్కరించుకొని మహాపూజను నిర్వహించి జాతరను ప్రారంభిస్తారు. ఆదివారం(రేపు) మహాపూజ జరగనుంది.


