News December 19, 2025

తూప్రాన్: తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు మెంబర్

image

తూప్రాన్ మండలంలో తమ్ముడు సర్పంచ్‌గా ఎన్నిక కాగా.. అక్క మనోహరాబాద్ మండలంలో వార్డు సభ్యురాలిగా ఎన్నికయ్యారు. తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఎంజాల స్వామి సర్పంచిగా ఎన్నికయ్యారు. మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామపంచాయతీలో స్వామి అక్క కనిగిరి అనసూయ వార్డు సభ్యురాలుగా పోటీ చేసి గెలుపొందారు. తమ్ముడు సర్పంచ్.. అక్క వార్డు సభ్యురాలుగా కొనసాగుతున్నారు.

Similar News

News January 25, 2026

పటాన్‌చెరులో యాక్సిడెంట్.. ఇద్దరు దుర్మరణం

image

పటాన్‌చెరు పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. స్థానికులు తెలిపిన వివరాలిలా.. ముత్తంగి జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి ముందు వెళ్తున్న లారీని ఢీ కొట్టినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 25, 2026

మెదక్: ఇద్దరు ఉద్యోగులపై కలెక్టర్ వేటు

image

మెదక్ జిల్లా ప్రభుత్వ దవాఖానలోని పబ్లిక్ హెల్త్ డయాగ్నస్టిక్ ల్యాబ్‌ను ఆదివారం కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విధులకు గైర్హాజరైన ఇద్దరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకున్నారు. అందులో ల్యాబ్ టెక్నీషియన్‌ను సస్పెండ్ చేయగా, మరొకరికి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.

News January 25, 2026

ఉత్తమ స్వీప్ అధికారిగా రాజిరెడ్డికి పురస్కారం

image

జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా సైన్స్ అధికారి(DSO) రాజిరెడ్డి ‘ఉత్తమ స్వీప్ అధికారి’గా ఎంపికయ్యారు. ఓటు హక్కుపై అవగాహన కల్పించడంతో పాటు, పోలింగ్ శాతం పెంచడంలో ఆయన చేసిన కృషికి గాను కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా మెమెంటో, సర్టిఫికెట్ అందుకున్నారు. గతంలో ఓటర్ల నమోదు, ఆధార్ అనుసంధాన ప్రక్రియలో విశేష సేవలు అందించినందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి నుండి నగదు పురస్కారం కూడా పొందారు.