News December 19, 2025
TTD కానుకల లెక్కింపులో టెక్నాలజీ వాడాలి: హైకోర్టు

AP: తిరుమల పరకామణిలో కానుకల లెక్కింపు ప్రక్రియను సమూలంగా ప్రక్షాళించాలని TTDని హైకోర్టు ఆదేశించింది. దొంగతనాలను అరికట్టేందుకు సంస్కరణలు చేపట్టాలని సూచించింది. కానుకల లెక్కింపులో మానవ ప్రమేయాన్ని తగ్గించి AI, అత్యాధునిక యంత్రాలను ఉపయోగించాలని సూచించింది. పరకామణి కేసు నిందితుడు రవికుమార్ ఆస్తుల అమ్మకాల వివరాలను వారంలోగా అందజేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను DEC 26కి వాయిదా వేసింది.
Similar News
News January 15, 2026
కనుమ రోజు గారెలు తింటున్నారా?

కనుమ నాడు మినుము తింటే మంచిదని పెద్దలు చెబుతారు. అలాగే మినుము తిన్నవాళ్లు ఇనుములా ఉంటారని మరో సామెత. చాలామంది కనుమరోజు కచ్చితంగా గారెలు తినేలా చూసుకుంటారు. అయితే పొట్టు తియ్యని మినుముల్లో పోషకాలు చాలానే ఉంటాయి. రాను రాను పొట్టు తీసిన మినప్పప్పు గారెలకు వాడుతున్నారు. కానీ మినప పొట్టుతో ఉన్న గారెలే ఆరోగ్యానికి శ్రేష్ఠం. మినుములో మాంసకృత్తులతోపాటు అనేక రకాలప్రోటీన్లు, పోషకాలు శరీరానికి లభిస్తాయి.
News January 15, 2026
టెన్త్ అర్హతతో RBIలో ఉద్యోగాలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)లో 572 ఆఫీస్ అటెండెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ టెస్ట్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. పదో తరగతి పాసైన వారు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, ఆపై చదువులు చదివిన వారికి అవకాశం లేదు. వయసు 18-25 ఏళ్ల మధ్య ఉండాలి. కచ్చితంగా తమ స్థానిక భాష రాయడం, చదవడం వచ్చి ఉండాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఫిబ్రవరి 4. సైట్: <
News January 15, 2026
ఎర్రవెల్లి నివాసంలో KCR సంక్రాంతి వేడుకలు

TG: ఎర్రవెల్లి నివాసంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కుటుంబ సభ్యులతో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకున్నారు. కుమారుడు కేటీఆర్ కూడా ఫ్యామిలీతో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఫాంహౌజ్‌లో రంగు రంగుల ముగ్గు ముందు కేసీఆర్‌తో కలిసి దిగిన ఫొటోలను KTR Xలో షేర్ చేశారు. తమ కుటుంబసభ్యుల తరఫున రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సంక్రాంతి విషెస్ చెప్పారు.


