News December 19, 2025
‘వీబీ-జీ రామ్ జీ’తో కనీస వేతనాలకు ముప్పు!

MGNREGA పేరును ‘వీబీ-జీ రామ్ జీ’గా మార్చిన కేంద్రం వ్యవసాయ సీజన్లో 60 రోజులు పనులు నిలిపివేసే అధికారాన్ని రాష్ట్రాలకు కల్పించింది. అయితే ఈ పథకం వల్ల ప్రైవేటు వ్యక్తులు కూలీలకు అంతకన్నా మెరుగైన వేతనాలు ఇచ్చేవారు. ఇప్పుడు సీజన్లో పథకం నిలిపివేస్తే ప్రైవేటు మోనోపలీ పెరిగి కనీస వేతనాలు దక్కవన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే రబీ, ఖరీఫ్ వ్యవసాయ సీజన్లలో కూలీల కొరత తీరుతుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
Similar News
News February 18, 2026
స్నాక్స్ లాగించేస్తున్నారా?

దాదాపు 76% మంది భారతీయులకు రోజుకు రెండుసార్లైనా స్నాక్స్ తినే అలవాటు ఉంది. బిస్కెట్స్, చిప్స్, షుగరీ ఫుడ్స్, డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల జీవక్రియపై ఒత్తిడి పడుతుంది. డయాబెటిస్ రిస్క్ పెరిగి, ఆయుష్షుపైన ప్రభావం పడుతుంది. భారతీయుల జీవనశైలికి ప్రొటీన్, ఫైబర్, సరిపడా కార్బ్స్ ఉండే బ్యాలెన్స్‌డ్ మీల్స్ రోజులో 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుందని.. స్నాక్స్ అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
News February 18, 2026
భర్త పర్మిషన్ లేకుండా బంధువుల ఇంటికెళ్తే 3 నెలల జైలు శిక్ష!

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్‌జాదా సరికొత్త క్రిమినల్ కోడ్ ఇటీవల అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం భర్త అనుమతి లేకుండా బంధువుల ఇంటికి వెళ్తే మహిళలకు 3 నెలల జైలు శిక్ష పడుతుంది. అలాగే భార్యలు, పిల్లలను భౌతికంగా శిక్షించే అధికారం భర్తలు, తండ్రులకు ఉంటుంది. అయితే, ఎముకలు విరగొద్దు. చర్మంపై ఏమాత్రం గాట్లు పడొద్దు. ఒకవేళ గాయాలైనట్లు ఆధారం ఉంటే మహిళ కోర్టును ఆశ్రయించొచ్చు.
News February 18, 2026
78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్

ఇండోర్‌కు చెందిన సుష్మా మౌఘే మరాఠీ సాహిత్యంలో మాస్టర్స్ చేసి గోల్డ్ మెడల్ అందుకున్నారు. గత నలభై ఏళ్లుగా సంగీత ఉపాధ్యాయురాలిగా చేసిన ఆమె కెమిస్ట్రీలో M.Sc కూడా చేశారు. అనేక పుస్తకాలు రచించడంతో పాటు హిందీ పుస్తకాలను మరాఠీలోకి అనువదించారు. 76ఏళ్ల వయసులో దేవి అహల్యా విశ్వవిద్యాలయంలో M.Aలో చేరి తాజాగా జరిగిన స్నాతకోత్సవంలో 78ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్ అందుకొని ఎందరికో ఆదర్శంగా నిలిచారు.


