News April 21, 2024
తిరుపతి: ఆ రోజు కార్మికులకు సెలవు

ఎన్నికలు జరిగే మే 13న ఉద్యోగ, ఉపాధి, కార్మికులకు సెలవు రోజని కర్నూలు జోన్ సంయుక్త కార్మిక కమిషనర్ బాలు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ దుకాణాలు, సంస్థల చట్టం- 1988 ప్రకారం ఎన్నికల రోజున వేతనాలతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. అర్హుడైన ఓటరుకు పోలింగ్ రోజున సెలవు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘించి సెలవు జారీ చేయకపోతే జరిమానాతో కూడిన శిక్షార్హులని చెప్పారు.
Similar News
News March 10, 2026
గుడిపల్లి : బైక్ నుంచి జారిపడి మహిళ మృతి

కుప్పం (M) కృష్ణదాసన పల్లెకు చెందిన షణ్ముగం భార్య సునీత (40) బైక్ నుంచి జారిపడి మృతి చెందింది. సోమవారం భార్యాభర్తలు తమిళనాడు రాష్ట్రం వేపనపల్లికి వెళుతుండగా గుడిపల్లి (M) శ్రీనివాసపురం సమీపంలో స్పీడ్ బ్రేకర్ వద్ద ప్రమాదవశాత్తు సునీత బైక్ నుంచి జారి కింద పడింది. ఈ క్రమంలో ఆమె తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. గుడిపల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
గుడిపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

గుడిపల్లి (M) ఆవుల తిమ్మనపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొనడంతో కోడిగాని పల్లెకు చెందిన రాధాకృష్ణ (32) మృతి చెందాడు. కర్ణాటక రాష్ట్రం బంగారుపేటలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాధాకృష్ణ బైకుపై గ్రామానికి వస్తుండగా కంప్రెసర్ ట్రాక్టర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రాధాకృష్ణ మృతి చెందాడు. గుడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News March 10, 2026
చిత్తూరు: KGBVల్లో ప్రవేశానికి దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలోని 7 KGBV బాలికల విద్యాలయాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో 40 సీట్లు, 7 నుంచి ఇంటర్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ఈనెల 12 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సమగ్రశిక్ష APC వెంకటరమణ తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే వీలుందన్నారు. ఏప్రిల్ 13-17 వరకు అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు KGBVలోని ప్రిన్సిపల్స్‌ను సంప్రదించాలన్నారు.


