News December 19, 2025
గుడివాడలో క్రికెట్ బెట్టింగ్ బాగోతం.!

గుడివాడలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న కూనసాని వినోద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. కొంతకాలంగా బెట్టింగ్ కార్యకలాపాలు సాగిస్తున్న వినోద్‌ను గుడివాడ వన్‌టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి రూ. 50 వేల నగదు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వినోద్‌ను కోర్టుకు తరలించారు. మిగిలిన బెట్టింగ్ బ్యాచ్‌ను త్వరలోనే పట్టుకుంటామని సీఐ తెలిపారు.
Similar News
News December 25, 2025
గుండెపోటుతో మొగల్తూరు డిప్యూటీ ఎంపీడీఓ మృతి

మొగల్తూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మండల డిప్యూటీ ఎంపీడీఓ ముచ్చర్ల నాగేశ్వరరావు (చిన్నా) గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. నరసాపురంలో ఓ మెడికల్ షాపు వద్ద ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆయన మృతితో మొగల్తూరులో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News December 25, 2025
మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన

ఈనెల 26న మీ చేతికి మీ భూమి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ గత పాలకుల తప్పిదాల వల్ల 22ఏ జాబితాలోకి వెళ్లిన భూముల విషయంలో బాధితులకు న్యాయం జరగలేదన్నారు. ఆరోజు ఉదయం 9.30 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 22ఏ భూములపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందన్నారు.
News December 25, 2025
జామలో కాయకుళ్లు తెగులు – నివారణ

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.


