News December 19, 2025
ప.గో: కానిస్టేబుల్‌గా ఎంపికైన అభ్యర్థుల వివరాలు పరిశీలన

ఉమ్మడి ప.గో జిల్లాకు కానిస్టేబుళ్లుగా ఎంపికైన అభ్యర్థులు 193 మంది డిసెంబర్ 20న ఉదయం 9 గంటలకు శిక్షణకు వెళ్లేందుకు లగేజితో హాజరుకావాలని ఎస్పీ ప్రతాప్ కిషోర్ తెలిపారు. సివిల్ కానిస్టేబుల్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థుల వివరాల్ని అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్.సూర్య చంద్రరావు శుక్రవారం పరిశీలించారు. పురుష అభ్యర్థులను అనంతపురం , మహిళా అభ్యర్థులను విజయనగరం పంపుతామన్నారు.
Similar News
News January 15, 2026
U19 WC: టాస్ గెలిచిన టీమ్ ఇండియా

అండర్-19 వరల్డ్ కప్‌లో యూఎస్ఏతో మ్యాచులో టీమ్ ఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
USA: ఉత్కర్ష్ శ్రీవాస్తవ(C), అద్నిత్, నితీశ్, అర్జున్ మహేశ్, అమరీందర్, సబ్రిశ్, అదిత్, అమోఘ్, సాహిల్, రిషబ్, రిత్విక్
ఇండియా: ఆయుశ్ (C), వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, విహాన్, అభిజ్ఞాన్, హర్‌వంశ్, అంబ్రీశ్, కనిశ్ చౌహన్, హెనిల్ , దీపేశ్, ఖిలన్.
* మ్యాచ్ లైవ్ జియో హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో చూడవచ్చు.
News January 15, 2026
RITESలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

RITESలో 7 అసిస్టెంట్ మేనేజర్(HR)పోస్టులకు అప్లై చేయడానికి ఈనెల 27 ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి MBA/PGDBM/PGDM/PGDHRM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.40,000-రూ.1,40,000 వరకు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://rites.com/
News January 15, 2026
తిరుపతి: భయపెడుతున్న టిప్పర్లు

తిరుపతి జిల్లా నుంచి తమిళనాడుకు భారీగా గ్రావెల్, ఇసుక, కంకర తరలిస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం మీదుగా రోజుకు 250 నుంచి 300 వరకు టిప్పర్లు బార్డర్ దాటుతున్నాయి. కొన్ని అనుమతులు లేకుండా, మరికొన్ని నకిలీ బిల్లులతో తరలిస్తున్నారని సమాచారం. పుత్తూరు-చెన్నై మెయిన్ రోడ్డుపై రాత్రి వేళ టిప్పర్లు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఆ మార్గంలో ప్రయాణాలంటేనే అందరూ హడలిపోతున్నారు.


