News April 21, 2024
REWIND.. నల్గొండ నుంచి 480 మంది పోటీ

28 ఏళ్ల కిందట నల్గొండ లోకసభ ఎన్నికల్లో 480 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి రికార్డు సృష్టించారు. ఒకే పార్లమెంట్ స్థానం నుంచి 480 మంది అభ్యర్థులు బరిలోకి దిగడానికి నీటి సమస్యే అసలు కారణం. జిల్లా నుంచే జీవ నదులు ప్రవహిస్తున్నా నీటి కేటాయింపులో మాత్రం వివక్ష ఎదురవుతోందని జల ఉద్యమకారులు భావించారు. కృష్ణానది జలాల్లో 76 శాతం వాటా తమకు రావాల్సిన ఉన్నా రాజకీయాల కారణంగా అది దక్కకుండాపోయిందని పోరాటం చేశారు.
Similar News
News March 14, 2026
NLG: తెల్లవారుజామున వాహనం ఢీకొని మహిళ మృతి

తిప్పర్తిలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఉదయం సుమారు 4:30 గంటల సమయంలో కేశరాజ్‌పల్లి గ్రామ సమీపంలో కాలినడకన వెళ్తుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 14, 2026
మిర్యాలగూడ: వాగులో పడి రైతు మృతి

మిర్యాలగూడ మండలం తడకమళ్లకి చెందిన అనంతుల లింగయ్య పొలానికి వెళ్లే సమయంలో పాలేరు వాగు దాటుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా వాగులో మృతదేహం లభ్యమైంది. మృతుని కుమారుడు సతీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై లక్ష్మయ్య తెలిపారు.
News March 14, 2026
పుకార్లు నమ్మొద్దు.. మోసపోవద్దు: నల్గొండ కలెక్టర్

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్ సరఫరాకు సంబంధించి ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని నల్గొండ కలెక్టర్ స్పష్టం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వల్ల గ్యాస్ దొరకదనే పుకార్లను నమ్మి అధిక ధరలకు కొనుగోలు చేసి మోసపోవద్దని సూచించారు. జిల్లాలోని 33 ఏజెన్సీల ద్వారా బుకింగ్ చేసిన 4 నుంచి 5 రోజుల్లోపు సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుతం ఏజెన్సీల వద్ద 8118 సిలిండర్ల నిల్వలు ఉన్నాయని తెలిపారు.


