News December 19, 2025
SIR: నేడు తమిళనాడు, గుజరాత్ లిస్ట్స్ విడుదల

ఓటర్ లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా తమిళనాడు, గుజరాత్ ఓటర్ల జాబితాను ECI కాసేపట్లో విడుదల చేయనుంది. ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో బెంగాల్ తరహాలో అభ్యంతరాల స్వీకరణకు నెల రోజుల గడువు మాత్రమే ఇచ్చే అవకాశముంది. కాగా ఇటీవల SIR పూర్తైన బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు, రాజస్థాన్: 42L, గోవా: 10L, పుదుచ్చేరి: లక్ష, లక్షద్వీప్: 1500 ఓట్లను తొలగించారు.
Similar News
News January 18, 2026
వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తవ్వాలి: CM

AP: ప్రాధాన్యతల వారీగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని CM చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేయాల్సిన కీలక ప్రాజెక్టులపై సమీక్షించారు. ‘గతేడాది గడుపు పెట్టుకుని హంద్రీ-నీవా కాల్వ వెడల్పు పనులు పూర్తి చేశాం. పోలవరం పనులు పరుగులు పెట్టించాం. 2026లో వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల నిర్మాణ పనులు పూర్తవ్వాలి’ అని ఆదేశించారు. నల్లమల సాగర్ సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టులపైనా చర్చించారు.
News January 18, 2026
AUS టూర్‌కు మహిళల ODI, T20 టీమ్స్ ఇవే

FEB 15-MAR 1 మధ్య జరగనున్న టీమ్ ఇండియా ఉమెన్స్ AUS పర్యటనకు సంబంధిచి BCCI జట్లు ప్రకటించింది.
T20: హర్మన్(C), స్మృతి, రేణుక, శ్రీ చరణి, వైష్ణవి, క్రాంతి, స్నేహ్ రాణా, దీప్తి, రిచా ఘోష్, కమలిని, అరుంధతి, అమన్‌జోత్, జెమీమా, ఫుల్మాలీ, శ్రేయాంక.
ODI: హర్మన్(C), స్మృతి, షెఫాలీ, రేణుక, శ్రీ చరణి, వైష్ణవి శర్మ, క్రాంతి, స్నేహ్ రాణా, దీప్తి, రిచా ఘోష్, కమలిని, కష్వీ గౌతమ్, అమన్‌జోత్, జెమీమా, హర్లీన్.
News January 18, 2026
జనవరి 18: చరిత్రలో ఈరోజు

* 1881: సంఘ సంస్కర్త, భాషావేత్త నాళం కృష్ణారావు జననం * 1927: ప్రముఖ సంగీత విద్వాంసుడు, దర్శకుడు సుందరం బాలచందర్ జననం * 1972: భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ జననం * 1975: సినీ నటి మోనికా బేడి జననం * 1978: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అపర్ణా పోపట్ జననం * 1996: సినీ నటుడు, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీఆర్ మరణం (ఫోటోలో) * 2003: హిందీ కవి హరివంశరాయ్ బచ్చన్ మరణం


