News April 21, 2024
టీడీపీ MP, MLA అభ్యర్థులకు బీఫామ్ అందించిన చంద్రబాబు

గుంటూరు జిల్లా టీడీపీ ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థులకు చంద్రబాబు నాయుడు ఆదివారం బీ-ఫామ్‌లను అందచేశారు. గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేశ్, గుంటూరు తూర్పు-మొహమ్మద్ నజీర్, గుంటూరు పశ్చిమ-గళ్లా మాధవి, ప్రత్తిపాడు-బూర్ల రామాంజనేయులు, పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర, తాడికొండ-తెనాలి శ్రావణ్ కుమార్లు బీ ఫామ్‌లను అందుకున్నారు.
Similar News
News March 27, 2026
GNT: కళల కాణాచి ముద్దుబిడ్డ గుత్తికొండ నరహరి

కళలకు పుట్టినిల్లు గుంటూరు జిల్లా.. కళల కాణాచి తెనాలి. ఈ గడ్డపై జన్మించిన గొప్ప మేధావి గుత్తికొండ నరహరి. ఆయన అమృతలూరు మండలం యలవర్రులో జన్మించారు. తెలుగు రాజకీయాల్లో అసమాన వక్తగా, రచయితగా, విశ్లేషకుడిగా చెరగని ముద్ర వేశారు. మూఢనమ్మకాలపై పోరాడి, ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం రేకెత్తించారు. గొప్ప నవ్య మానవవాదిగా పేరొందిన నరహరి వర్ధంతి నేడు (మార్చి 27). ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News March 27, 2026
GNT: ఉపాధి పనులకు లక్ష్యాలు..!

గుంటూరు జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని అధికారులు నిర్ణయించారు. వచ్చే నెల నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 30 వేల పనిదినాలు సృష్టించాలనే లక్ష్యం పెట్టారు. పనుల ఎంపికలో ఆమోదం పొందిన వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఒక్కో గ్రామంలో కనీసం 30 పనులు ఒకేసారి కొనసాగించాలని ఆదేశించారు. ఈ నెల 31లోపు మస్టర్లు ముగించాలని గడువు పెట్టారు. వివరాలు యుక్తధారా పోర్టల్‌లో నమోదు చేయాలని తెలిపారు.
News March 27, 2026
గుంటూరులో ఆర్టీఈ ప్రవేశాలు పెరుగుదల

పేద విద్యార్థులకు ఉచిత విద్య కల్పించే ఆర్టీఈ అమలు వేగం పెరిగింది. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో మొత్తం 2,487 మంది విద్యార్థులను ఎంపిక చేశారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గుంటూరులోనే 1,708 మందికి అవకాశాలు లభించాయి. లాటరీ విధానంలో పారదర్శకంగా ఎంపిక జరిగింది. ఎంపికైన విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో ప్రభుత్వం ఫీజులు భరిస్తుంది. తల్లిదండ్రులకు సమాచారం అందించారు.


