News December 19, 2025
సైబర్ నేరాల అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ శబరీష్

సైబర్ నేరాల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పోలీసు శాఖ చేస్తున్న విస్తృత ప్రయత్నంలో భాగంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరిష్ ఆన్లైన్ మోసాలను సూచించే వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆన్లైన్లో అపరిచితులతో పరిచయాలను దూరంగా ఉండాలని, డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్ చేసి పోలీసులంటే నమ్మొద్దని, సైబర్ మోసమని గుర్తించి వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
Similar News
News February 14, 2026
తెలంగాణలో ‘జనసేన’ను పట్టించుకోలేదు!

మున్సిపాలిటీ ఎన్నికల్లో పవన్ ‘జనసేన’ను TG ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. మొత్తం 336 వార్డులు/డివిజన్లలో ఆ పార్టీ పోటీ చేయగా రెండు చోట్ల (మంచిర్యాల, నేరేడుచర్ల) మాత్రమే గెలిచింది. చాలా చోట్ల జనసేనకు సింగిల్ డిజిట్ ఓట్లే నమోదైనట్లు సమాచారం. దీనికి రాష్ట్రంలో పార్టీకి బలమైన క్యాడర్ లేకపోవడం, ప్రచారంలో వెనకబడటం, చివరి నిమిషంలో సేనాని పవన్ ప్రచారం రద్దవ్వడం వంటివి కారణాలు కావొచ్చు.
News February 14, 2026
MBNR: ఒక్క ఓటుతో ‘కమలం’ విజయం.. వీడిన ఉత్కంఠ!

పాలమూరు కార్పొరేషన్ 53వ డివిజన్‌లో బీజేపీ అభ్యర్థి నాగలిగారి రమేశ్ అద్భుత విజయం సాధించారు. మూడుసార్లు రీకౌంటింగ్ జరగ్గా, చివరకు కాంగ్రెస్ అభ్యర్థి రాఘవేందర్‌పై కేవలం ఒక్క ఓటు మెజార్టీతో రమేశ్ గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఈ ఉత్కంఠ పోరుతో తెల్లవారుజాము వరకు ఫలితంపై టెన్షన్ నెలకొంది. మరోవైపు 58వ డివిజన్ ఇప్పటికే కాంగ్రెస్ ఏకగ్రీవం చేసుకుంది.
News February 14, 2026
HYD: మీలాంటి వ్యక్తి మీ కూతురుకి భర్తగా వస్తే?

HYDలో 3 ముళ్ల బంధాలు మున్నాళ్ల ముచ్చటవుతున్నాయి. ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడమే కారణంగా తెలుస్తోంది. నిపుణుల సలహా ఏంటంటే.. మీ కూతురుకి మీలాంటి లక్షణాలున్న వ్యక్తి భర్తగా వస్తే అంగీకరిస్తారా? అలాగే స్త్రీలూ మీ అబ్బాయికి మీలాంటి వ్యక్తి భార్యగా వస్తే అంగీకరిస్తారా? అంగీకరించలేకుంటే అలా మిమ్మల్ని మార్చుకుంటే బంధాలు నిలబడతాయి. యువత ఆత్మపరిశీలన చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాలని సూచిస్తున్నారు.


