News April 21, 2024
బైకులు నడిపే వారికి ప్రకాశం జిల్లా ఎస్పీ హెచ్చరికలు

బైకులకు విపరీతమైన శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించి 118 వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లు వాడితే మోటార్ వెహికల్ చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని ఎస్పీ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News April 8, 2026
వడదెబ్బకు జాగ్రత్తలు పాటించండి: కలెక్టర్

వేసవి వేడి తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో వడదెబ్బకు ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు బుధవారం ప్రజలకు ప్రకటన రూపంలో సూచించారు. ఎక్కువగా నీరు, మజ్జిగ, పండ్లరసాలు తీసుకోవాలని, మధ్యాహ్న సమయంలో బయటకు వెళ్లకూడదని చెప్పారు. తల కప్పుకుని బయటకు వెళ్లడం, వృద్ధులు, చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. వేడి సమయంలో కఠిన శారీరక శ్రమ చేయకూడదని హెచ్చరించారు.
News April 8, 2026
మార్కాపురం: ఏప్రిల్ 13వ పుష్పయాగ మహోత్సవం

మార్కాపురంలోని లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగింపు సందర్భంగా ఏప్రిల్ 13వ తేదీ పుష్పయాగ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం 6 గంటలకు 500 కేజీల 12 రకాల పుష్పాలతో 12 రకాల నైవేద్యాలతో పుష్పయాగ మహోత్సవం జరుగునన్నారు. భక్తులు యాగంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
News April 8, 2026
విద్యార్థుల తల్లిదండ్రులకు ఎస్పీ కీలక సూచన

పరీక్షలు ముగిసి వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంగళవారం ప్రకాశం జిల్లా ఎస్పీ హర్ష వర్ధన్ రాజు సూచించారు. సరదా కోసం పిల్లలు, యువకులు గ్రామాలు, పట్టణాల శివార్లలోని కుంటలు, చెరువులు, కాలువలు, బావుల వద్దకు లేదా ఈతకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని సూచించారు. పోలీసులు గ్రామాల్లో అప్రమత్తంగా ఉండేలా ఆదేశించామన్నారు.


