News December 19, 2025

కామారెడ్డి: బడా నేతల స్వగ్రామాల్లో చుక్కెదురు

image

కామారెడ్డి జిల్లాలో GP ఎన్నికల్లో ప్రజలు వినూత్న తీర్పునిచ్చారు. మాజీ MLA గంప గోవర్ధన్ స్వగ్రామం బస్వాపూర్‌లో తుడుం పద్మ(కాంగ్రెస్), మాజీ MLA ఏనుగు రవీందర్ రెడ్డి స్వగ్రామం ఎర్రపహాడ్‌లో సొంఠికీ మల్లవ్వ(BJP), కామారెడ్డి ఎమ్మెల్యే కేవీ రమణా రెడ్డి స్వగ్రామం దేమికలాన్‌లో కటకం భార్గవి(BRS) గెలిచారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇలాకాలో పోతుగంటి సంతోష్ రెడ్డి(స్వతంత్ర అభ్యర్థి) విజయం సాధించారు.

Similar News

News January 7, 2026

స్వర్ణ నారావారి పల్లెలో సీఎం ప్రారంభించనున్న కార్యక్రమాలు

image

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని CM చంద్రబాబు స్వర్ణ నారావారిపల్లెలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పకృతి వ్యవసాయం, యానిమల్ హాస్టల్, సబ్ స్టేషన్, స్కిల్ డెవలప్మెంట్ భవనం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (50 బెడ్స్) ఈ సంజీవిని ప్రాజెక్టు, టాటా DINC, శేషాచల లింగేశ్వర స్వామి ఆలయానికి CC రోడ్డు, 33/11 KV ఇండోర్ సబ్ స్టేషన్ ప్రారంభిస్తారు. మహిళలకు ఈ ఆటోల పంపిణీ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

News January 7, 2026

KNR: కల్తీ ఫుడ్ పై కంట్రోల్ ఏది?

image

ఉమ్మడి KNR జిల్లాలో కల్తీ నూనె, మసాలాలు, టేస్టీ సాల్ట్ సింథటిక్ కలర్స్ విచ్చలవిడిగా వాడుతున్నట్లు తెలుస్తోంది. 2025-AUG-25న టాస్క్ ఫోర్స్ బృందం ‘మిఠాయి వాలా’, ‘మైత్రి’, ‘అనిల్ స్వీట్స్’లలో తనిఖీలు చేపట్టి శాంపిల్స్ సేకరించింది. వాటిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించలేదు. రెగ్యులర్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ తనిఖీలు కరువయ్యాయి. ఇప్పటికైనా రెగ్యులర్ ఆఫీసర్స్‌ను నియమించాలని ప్రజలు కోరుతున్నారు.

News January 7, 2026

ఒకటిన్నర ఎకరా పొలం.. అద్భుత ఆలోచనతో అధిక ఆదాయం

image

ఒకటిన్నర ఎకరంలో సమీకృత వ్యవసాయం చేస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నారు ఏలూరు జిల్లా ఉంగుటూరుకు చెందిన గద్దె వెంకటరత్నం. ఆరేళ్ల నుంచి తనకు ఉన్న ఎకరన్నర విస్తీర్ణంలో 70 సెంట్లలో వరి, 5 మీటర్ల వెడల్పు 2 మీటర్ల లోతుతో వరి పొలం చుట్టూ కందకం తవ్వి 4 రకాల చేపలను పెంచుతున్నారు. 6 మీటర్ల వెడల్పు గట్టుపై 700 అరటి, 80 కొబ్బరి చెట్లతో పాటు 50 రకాల పండ్లు, కూరగాయల రకాలను పెంచుతూ ఏడాదంతా ఆదాయం పొందుతున్నారు.