News December 19, 2025
మంత్రి ‘కొల్లు’తో బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ బృందం భేటీ

రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం లక్ష్యంగా బ్రిటీష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్ మెంట్స్ ప్రతినిధుల బృందం శుక్రవారం మంత్రి కొల్లు రవీంద్రను కలిసింది. రాష్ట్రంలో కర్బన ఉద్గారాల నివారణ, పర్యావరణ పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని, వాటిలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అదే సమయంలో మచిలీపట్నం పరిసరాల్లో బీచ్ టూరిజం అభివృద్ధికి పెట్టుబడులు పెడతామన్నారు.
Similar News
News January 16, 2026
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు..!

*గద్వాల: రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన
*మైనార్టీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులు ఆహ్వానం
*జిల్లాకు 5 మంది కొత్త ల్యాబ్ టెక్నీషియన్లు
*అయిజ: మున్సిపల్ ఎన్నికలకు 42 పోలింగ్ బూత్‌లు
*అలంపూర్: రేపు అమ్మవారి దర్శనం నిలిపివేత
*మానవపాడు: మెడిసిన్ స్టూడెంట్ మృతి పట్ల ప్రముఖుల నివాళి
*ఇటిక్యాల: వావిలాలలో వృషభాల బల ప్రదర్శన
*కేటి దొడ్డి: రోడ్డు భద్రత అందరి బాధ్యత- ఎస్సై శ్రీనివాసులు
News January 16, 2026
గద్వాల్: పేదరికం జయించి.. 3 ప్రభుత్వ ఉద్యోగాలు

ధరూర్ మండలం రేవులపల్లి గ్రామానికి చెందిన నాగరాజు గ్రూప్-3 ఉద్యోగం సాధించారు. ఈరోజు మాదాపూర్ శిల్పకళావేదికలో నియామక పత్రాన్ని అందుకున్నారు. నాగరాజును తల్లి నర్సమ్మ కష్టపడి చదివించింది. పేద కుటుంబంలో పుట్టి మూడు ఉద్యోగాలు సాధించడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. 2018లో పంచాయతీ సెక్రటరీ, గ్రూప్-4 ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం ఎర్రవల్లి బెటాలియన్-10లో ఉద్యోగం చేస్తున్నారు.
News January 16, 2026
సూళ్లూరుపేట: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాలెం సమీపంలో చెన్నై వైపు వెళ్తున్న రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. సూళ్లూరుపేట GRPF పోలీసుల కథనం మేరకు.. 40-45 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి భువనేశ్వర్ ఎక్స్‌ప్రెస్ రైలు నుంచి జారిపడి మృతి చెందినట్లు తెలిపారు. వివరాలు తెలిస్తే సూళ్లూరుపేట GRPF పోలీస్ స్టేషన్‌లో తెలపాలని కోరారు.


