News December 19, 2025
ప్రొద్దుటూరులో నేడు బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరులో శుక్రవారం బంగారం, వెండి ధరల వివరాలను వ్యాపారులు వెల్లడించారు.
*బంగారం 24 క్యారెట్ 1గ్రాము ధర: రూ.13,220.00
*బంగారం 22 క్యారెట్ 1గ్రాము ధర: రూ.12,162.00
*వెండి 10 గ్రాముల ధర: రూ.1,980.00
Similar News
News January 20, 2026
రామచంద్రమూర్తికి జీవన సాఫల్య పురస్కారం: YVU వీసీ

ప్రముఖ జర్నలిస్టు, సంపాదకులు కె.రామచంద్రమూర్తికి గజ్జెల మల్లారెడ్డి జీవన సాఫల్య పురస్కారం-2025 ఇవ్వనున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయ వి.సి ప్రొ.బెల్లంకొండ రాజశేఖర్ తెలిపారు. పత్రికా రంగంలో విశిష్ట సేవలు అందించిన జర్నలిస్టులకు ప్రతి ఏటా ఒకరికి అవార్డును అందజేస్తున్నారు. 2025కు ఈయన్ను ఎంపిక చేశామన్నారు.
News January 20, 2026
లక్కిరెడ్డిపల్లి గంగమ్మ జాతర ఎప్పుడంటే..?

లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురంలో ఫిబ్రవరి 16, 17వ తేదీల్లో గంగమ్మ జాతర జరగనుంది. దీనికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతర నిర్వాహకులకు మంగళవారం సూచించారు. గ్రామంలో జరిగిన గంగమ్మ పార్వేట ఉత్సవంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గంగమ్మ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు విశేష సంఖ్యలో హాజరవుతారని చెప్పారు.
News January 20, 2026
కడప: గుండెపోటుతోనే విజయకుమారి మృతి: ఏపీ ఫ్యాక్ట్ చెక్

సర్వేల పేరుతో వేధించడంతోనే కడపలో సచివాలయ ఉద్యోగిని జి.విజయకుమారి చనిపోయిందని వైసీపీ ట్వీట్ చేసింది. దీనిని ఏపీ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ‘విజయకుమారి దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు తన ఇంటికి సమీపంలోని సచివాలయానికి ప్రభుత్వం బదిలీ చేసింది. ఈనెల 18న గుండెపోటు రావడంతో ఆమె చనిపోయింది. ప్రభుత్వ వేధింపులతో అని తప్పుడు ప్రచారం చేయడం తగదు’ అని ట్వీట్ చేసింది.


